టైర్ 2 హీరోల్లో ఆ రిస్క్ చేస్తున్న ఒక్కడు..?
లేటెస్ట్ గా సితార బ్యానర్ లో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా గురించి కూడా ఇలాంటి అప్డేట్ వచ్చింది.
బాహుబలి ముందు వరకు ఒక కథను ఒక సినిమాగానే చెప్పాలని అవసరమైతే మూడు గంటలు సినిమా ఆడించవచ్చని అనుకునే వారు. కానీ రాసుకున్న కథ.. ఎంచుకున్న పాత్రలు.. వస్తున్న అవుట్ పుట్ చూసి మన జక్కన్నకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అదే సినిమా ఎందుకు రెండు భాగాలుగా చెప్పకూడదు అనిపించింది. బాహుబలి 1 ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న వేరే డౌట్ లేకుండా సినిమాను మధ్యలో ఆపేసి పార్ట్ 2 అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఐతే అప్పుడు రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం చాలా చర్చలు జరిగేలా చేసింది.
ఐతే ఆ తర్వాత నుంచి స్టార్ సినిమా ప్రతి ఒక్కటి రెండు భాగాలుగా చేస్తూ వస్తున్నారు. బాహుబలి తర్వాత కె.జి.ఎఫ్ అదే పంథా కొనసాగించి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పుష్ప రెండు భాగాలు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. అదే దారిలో కాంతారా, దేవర వస్తున్నాయి. ఐతే ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే కథ రెండు భాగాలకు కుదురుతుంది అనుకుంటే చాలు సినిమా మొదలైన కొన్నాళ్లకే రెండు భాగాలు రిలీజ్ అని ప్రకటిస్తున్నారు.
లేటెస్ట్ గా సితార బ్యానర్ లో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా గురించి కూడా ఇలాంటి అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రెండు భాగాలుగా రాబోతుందని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలే ఇలా రెండు భాగాల ప్రయత్నాలు జరిగాయి.
విజయ్ దేవరకొండ స్టారే అయిన టైర్ 2 కిందకే వస్తాడు. అలాంటి తన సినిమా రెండు భాగాలు చేయడం కాస్త సర్ ప్రైజింగ్ గానే ఉంటుంది. అంతేకాదు రెండు భాగాలు సినిమా అంటే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కథ కథనాలతో పాటు హీరో పాత్ర కూడా వాళ్లను టచ్ చేయాల్సి ఉండాలి. అలా వాళ్లని కదిలించగలిగే సత్తా ఉంటేనే రెండో భాగం కోసం ఎదురుచూస్తారు. ఐతే విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా గొప్ప ప్రయంతమే చేస్తున్నాడు.
ఐతే మేకర్స్ అలా ఫిక్స్ అయ్యారు అంటే కచ్చితంగా సినిమాలో విషయం ఉండే ఉంటుందని అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి ఇద్దరు కలిసి ఏదో అద్భుతాన్నే సృష్టిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. కొన్నాళ్లుగా కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి రెండు భాగాలతో రచ్చ చేయాలని చూస్తున్నాడు. మరి విజయ్ సినిమాపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.