'భైరవ ద్వీపం' విలన్ కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు అలియాజ్ రాజ్ కుమార్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు అలియాజ్ రాజ్ కుమార్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ విజయ రంగరాజు మెరుగైన వైద్యం కోసం చెన్నైకి వెళ్లారు. దీనిలో భాగంగా చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. రాజ్ కుమార్ మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. విజయ రంగరాజు అప్పట్లో ఎంతో ఫేమస్ నటుడు. విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు. నటుడిగా ఆయన ప్రస్థానం `భైరవ ద్వీపం` కంటే ముందే జరిగిందంటారు. `అశోక్ చక్రవర్తి`, `స్టేట్ రౌడీ` ,` విజయ్` చిత్రాల్లోనూ వియజ రంగరాజు నటించారని తెలుస్తోంది. 1993 లో ఈ.వీ.వీ. సత్యనారాయణ దర్శకత్వం వహించిన `మగరా యుడు`లోనూ నటించారు.
ఆ తర్వాత `మేడమ్` అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1994 లో `బైరవ ద్వీపం` సినిమాలో విలన్ పాత్రతో ఎంతో ఫేమస్ అయ్యారు. నటుడిగా ఆసినిమా అతడికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అటుపై గోపీచంద్ హీరోగా నటించిన `యజ్ఞం`లో నటించి వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత `విశాఖ ఎక్స్ ప్రెస్` ,` ఢమరకం`, `బ్యాండ్ భాజా`, `శ్లోకం` చిత్రాల్లో నటించారు. అయితే నటుడిగా విజయ రంగరాజుకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ప్రతిభా వంతుడైనా అవకాశాలు అందుకోవడంలో వెనుకబడ్డారు.
అలా రంగరాజు కెరీర్ కి గ్యాప్ ఏర్పడింది. ఆయన మంచి బాడీ ల్డర్ కూడా. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో ప్రావీణ్యం సంపాదించారు. మంచి ఫిట్ నెస్ ప్రియుడు. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ కొన్ని సినిమాలు చేసారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు. విజయ రంగరాజుకి రజినీకాంత్‌తో మంచి స్నేహం ఉందని అంటారు. అతడి పరిచయంతోనూ కొన్ని సినిమా అవకాశాలు అందుకున్నట్లు పలు సందర్భాల్లో రంగరాజు చెప్పుకొచ్చారు.