సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల షేర్.. RRR రికార్డును కూడా కొట్టేసి..

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

Update: 2025-01-20 09:15 GMT

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండగా, 6వ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్ల షేర్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.16.12 కోట్ల షేర్‌తో అత్యధిక 6వ రోజు కలెక్షన్‌ను సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.


అలాగే రాజమౌళి ఆర్ఆర్ఆర్ 9 కోట్ల షేర్ రికార్డును సైతం అధిగమించడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో, ఆ టాక్‌ను కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రతి రోజు ఊహించని కలెక్షన్లను సాధిస్తూ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఈ సినిమా, ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల షేర్ మార్క్‌ను దాటేసింది. మరోవైపు, ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి, వెంకటేష్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సినిమాగా నిలిచింది.

నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, థియేటర్లలో కనిపిస్తున్న ప్రేక్షకుల స్పందన చూస్తుంటే 3 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో, ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తోంది. 6వ రోజైన ఆదివారం నైజాం ఏరియాలో రూ.4.21 కోట్ల షేర్‌ను అందుకొని, మొదటి రోజు వసూళ్లను దాదాపు సమం చేయడం విశేషం. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో మొత్తం రూ.22.56 కోట్ల షేర్ సాధించింది (GST తప్పించి). ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సాధించిన అద్భుత ఫీట్ అని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కలెక్షన్లు:

నైజాం: ₹4.21 కోట్లు

ఈస్ట్: ₹1.23 కోట్లు

వెస్ట్: ₹0.73 కోట్లు

కృష్ణా: ₹0.93 కోట్లు

గుంటూరు: ₹0.89 కోట్లు

నెల్లూరు: ₹0.39 కోట్లు

విశాఖపట్నం: ₹2.18 కోట్లు

సీడెడ్: ₹2.14 కోట్లు

మొత్తం: ₹12.5 కోట్లు (6వ రోజు AP/TS షేర్)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే గోల్డెన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాలీవుడ్‌లో కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ నిర్మించిన ఈ చిత్రం ఫెస్టివల్ సీజన్‌లో దూసుకుపోయి, రాబోయే రోజుల్లో కూడా అదే జోరు కొనసాగిస్తుందని అనిపిస్తోంది.

Tags:    

Similar News