ఆ డైరెక్టర్ కిది అతి పెద్ద సాహసమేనా?
వచ్చే ఎన్నికల్లో విజయ్ బరిలోకి దిగుతున్నాడు? ఈ నేపథ్యంలో ప్రజలంతా తన పక్షాన నిలబడేలా ఈ సినిమా కథ, కథనాలు ఇన్ స్పైర్ చేసేలా ఉండాలి.
తలపతి విజయ్ 69వ చిత్రం 'జన నాయగన్' హెచ్. వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలి సిందే. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న రాజకీయ నేపథ్యంగల స్టోరీ. వచ్చే ఎన్నికల్లో విజయ్ బరిలోకి దిగుతున్నాడు? ఈ నేపథ్యంలో ప్రజలంతా తన పక్షాన నిలబడేలా ఈ సినిమా కథ, కథనాలు ఇన్ స్పైర్ చేసేలా ఉండాలి. వినోద్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు.
అయితే ఈ సినిమా వినోద్ శైలికి పూర్తి భిన్నమైన సినిమా. ఇప్పటి వరకూ ఆయన రాజకీయ నేపథ్యం గల సినిమాలు చేయలేదు. ఆయన అనుభవం అంతా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది. తొలి సినిమా `సత్రుంగ వైట్టె` బ్లాక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తీసాడు. అటుపై కాఫ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో `కాఖీ` చిత్రాన్ని తీసాడు. ఇది తమిళనాడులో జరిగిన వాస్తవ దోపడీ ఆధారంగా తీసిన చిత్రం.
అటుపై తల అజిత్ తో `నెర్కొండ పార్వై` చేసాడు. ఇదొక లీగల్ డ్రామా. బాలీవుడ్ లో రూపొందిన `పింక్` చిత్రానికి రీమేక్ ఇది. అటుపై అజిత్ తోనే `వలిమై`, `తనీవు` యాక్షన్ చిత్రాలు చేసాడు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలే. దర్శకుడిగా వినోద్ ని అగ్ర దర్శకుల సరసన కూర్చెబెట్టాయి. యాక్షన్ చిత్రాలు వినోద్ కి కొట్టిన పిండి. నెక్స్ట్ లెవల్ యాక్షన్ చూపించగలడు.
కానీ విజయ్ తో మాత్రం రాజకీయ నేపథ్యాన్ని టచ్ చేయడంతో? అతడికిది సవాల్ విసిరే సాహసోపేతమైన చిత్రమనే అనిపిస్తుంది. విజయ్ కూడా వినోద్ గత విజయాల్ని చూసే ఈ అవకాశం ఇచ్చాడు. కోలీవుడ్ లో ఎంతో మంది దర్శకులున్నా? అందర్నీ పక్కనబెట్టి ఛాన్స్ ఇచ్చాడు? అంటే ఈ కథను, డైరెక్టర్ని విజయ్ ఎంతగా నమ్ముతున్నాడు? అన్నది తెలుస్తుంది. జన నాయగన్ స్టోరీ కూడా వినోద్ దే.