విజయ్ సేతుపతి.. క్రేజీ సీక్వెల్ కు అంతా సెట్!

ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించి ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించారు.

Update: 2024-09-11 14:19 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీలోని విలక్షణ నటుల్లో ఒకరిగా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో అలరిస్తున్నారు. రీసెంట్ గా మహారాజ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించి ఆడియెన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించారు.

విజయ్ సేతుపతి ల్యాండ్ మార్క్ మూవీగా వచ్చిన మహరాజ.. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ అదరగొట్టింది. భారీ వ్యూస్ దక్కించుకుని అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అయితే కెరీర్ లో ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన.. తన అప్ కమింగ్ చిత్రాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సహాయ పాత్రల్లో నటించనని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రస్తుతం పాండిరాజ్ మూవీ చేస్తున్న ఆయన.. మరో రెండు సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పూర్తి చేసిన రైల్, విడుతలై-2 సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 2024 చివరి కల్లా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి లైనప్ లోకి మరో మూవీ చేరింది. అదే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 96 సీక్వెల్. విజయ్ హీరోగా 2018లో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ మూవీ 96.. మంచి రెస్పాన్స్ అందుకుంది.

సీనియర్ బ్యూటీ త్రిష నటించిన ఆ సినిమాను డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. స్కూల్ డేస్ లో ప్రేమించుకుని, విడిపోయి 25 ఏళ్ల తర్వాత గెట్ టు గెదర్ లో కలుసుకున్నప్పుడు వారి మధ్య జరిగిన ఘటనలతో వచ్చిన 96 మూవీ.. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్లు ప్రేమ్ కుమార్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిపారు.

విజయ్, త్రిష డేట్స్ ఇవ్వగానే అన్ని పనులు మొదలవుతాయని తెలిపారు. షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే విజయ్ సేతుపతి సతీమణికి కథ చెప్పానని అన్నారు. తనను ఎంతగానో ఎగ్జైట్ చేసిన సినిమా 96 సీక్వెల్ అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వెయిటింగ్ ఫర్ టాప్ రొమాంటిక్ మూవీ సీక్వెల్ అని కామెంట్లు పెడుతున్నారు. మరి 96 -2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News