కంగారూ దేశంలో కంగారు పెడుతున్న జంట
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షికారు చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
కంగారూ దేశంపై బ్యాట్ ఝలిపించడంలో.. మైదానంలో బౌండరీలు బాదడంలోనే కాదు.. కంగారూ దేశంలో విహరించడంలోను కోహ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షికారు చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మెల్ బోర్న్ లోని ఓ కేఫ్‌లో విరుష్క జోడీ భోజనాన్ని ఆస్వాధించారు. యథేచ్ఛగా నగరం చుట్టొచ్చారు. మెల్‌బోర్న్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఒక అభిమాని ఈ అందమైన క్షణాన్ని క్యాప్చర్ చేశాడు. ఆస్ట్రేలియాలో భారత పర్యటనలో భాగంగా కోహ్లీ, పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించలేకపోయాడు. ఈ సమయంలో కొంత సమయం చిక్కింది. భార్యతో కోహ్లీ ఇలా నగరంలో విహరించాడు.
ఈ అందమైన జంట మెల్ బోర్న్ లోని ఓ కేఫ్ కం రెస్టారెంట్ లో తినుబండారాలు తిన్నారు. వంటగదిలోని చెఫ్‌లకు వ్యక్తిగతంగా కోహ్లీ కృతజ్ఞతలు తెలిపిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ హాలిడే రోజున కేఫ్ తెరిచారో లేదో అనుకున్నామని, అయితే లోపలికి వెళ్లినప్పుడు చాలా ఆశ్చర్యపోయామని కూడా విరుష్క వెల్లడించారు. సెలవు రోజు కేఫ్ తీయాలా వద్దా అని సంశయించినా కానీ ఇలా కోహ్లీ- అనుష్క కుటుంబానికి సేవ చేసే అవకాశం లభించిందని కేఫ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చెఫ్ లు తమ వంట గదిలో ఫోటోలు తీసుకుని కోహ్లీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పర్యటనలో అనుష్క తన భర్త ఆటను వీక్షిస్తూ ఆనందిస్తోంది. కోహ్లీ టెస్టులో సెంచరీ చేసిన సమయంలో స్టాండ్స్ లోనే నిలిచి ఉంది అనుష్క. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు, ఈ సిరీస్‌లో కోహ్లీ తన ఇతర నాలుగు ఇన్నింగ్స్‌లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో మరో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. ఇరు జట్లు ఒక్కో విజయం అందుకోగా ఒక టెస్ట్ డ్రా అయింది. ఇప్పుడు నాలుగో టెస్ట్ విజేతను నిర్ణయించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.