బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చిన విశ్వక్
ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా సినిమాకీ భిన్న కథలను ఎంచుకుంటూ, తనదైన టాలెంట్ తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు విశ్వక్ సేన్. అతను నటించిన తాజా సినిమా లైలా. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా ఆకాంక్ష శర్మ నటించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను విశ్వక్ తెగ ప్రమోట్ చేస్తున్నాడు. లైలా క్యారెక్టర్ తన కెరీర్లోనే బెస్ట్ గా నిలుస్తుందని చెప్తున్న విశ్వక్ రీసెంట్ గా తన బ్రేకప్ స్టోరీని వివరించాడు.
టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూడగానే వెంటనే ఇష్టమొస్తుంది. ఆ టైమ్ లో దాన్నే సీరియస్ రిలేషన్‌షిప్ అనుకుంటాం. కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తుందని, అలాంటి సిట్యుయేషనే తన లైఫ్ లో కూడా జరిగిందని విశ్వక్ తెలిపాడు. దాంతో పాటూ తనకు ఓ సీరియస్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్టు విశ్వక్ వెల్లడించాడు.
24 ఏళ్ల వయసులో తాను ప్రేమలో పడ్డానని, ఆ తర్వాత మూడున్నరేళ్లకు బ్రేకప్ అయిందని, బ్రేకప్ అయ్యాక ఎంతో బాధపడినట్టు చెప్పిన విశ్వక్, ఆ బాధ నుంచి బయటకు వచ్చాకే తన లైఫ్ లో ఫోకస్ గా ఉన్నానని, ఆ తర్వాత ఎవరి మీదా ఎలాంటి ఇష్టం కలగలేదని, టైమొచ్చినప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటానని విశ్వక్ వెల్లడించాడు.
తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో బాధ పడినట్టు చెప్పిన విశ్వక్, 27 ఏళ్ల వయసులో కూడా బాధతో ఏడ్చిన రోజులున్నాయని, బాధగా అనిపించినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధ నుంచి వెంటనే బయటకు వచ్చే అవకాశముంటుందని విశ్వక్ తెలిపాడు. ఇక సినిమా విషయానికొస్తే ఇప్పటివరకు లైలా నుంచి రిలీజైన కంటెంట్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కోసం విశ్వక్ చాలా కష్టపడినట్టు స్పష్టమవుతోంది.