పాన్ ఇండియా వైఫల్యాలు వాళ్లలో కసిని పెంచిందా?
అలా టాలీవుడ్..శాండిల్ వుడ్ పాన్ ఇండియా మార్కెట్ లో పాగా వేసాయి.
టాలీవుడ్ నుంచి 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్', 'కార్తికేయ-2', 'పుష్ప' లాంటి చిత్రాలు ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్లో సంచలనమైన సంగతి తెలిసిందే. అటుపై కన్నడ నుంచి 'కేజీఎఫ్', 'కాంతార' లాంటి సినిమాలు పాన్ ఇండియాలో కొత్త రికార్డులు నమోదు చేసాయి. అలా టాలీవుడ్..శాండిల్ వుడ్ పాన్ ఇండియా మార్కెట్ లో పాగా వేసాయి. ఈ రెండు పరిశ్రమల నుంచి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అంటే అదీ పాన్ ఇండియా సినిమానా? అంటున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై పాన్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా కంటెంట్ సినిమాలు చేయడానికే చూస్తున్నారు. త్వరలో 'పుష్ప-2', 'గేమ్ ఛేంజర్' కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలపై ఇండియా వైడ్ భారీ అంచనాలున్నాయి. మరి ఇలా కోలీవుడ్ ఎందుకు పాన్ ఇండియాలో ఫేమస్ కాలేకపోతుంది. వాళ్ల పాన్ ఇండియా ప్రయత్నాలు ఎందుకు బెడిసి కొడుతున్నాయి.
విక్రమ్ నటించిన 'తంగలాన్' , సూర్య నటించిన కంగువ ఎందుకు పాన్ ఇండియా మార్కెట్ లో ఫెయిలయ్యాయి? అన్నది అక్కడ మేకర్స్ కి అంతు చిక్కని ప్రశ్నగా మారింది. 'తంగలాన్' స్టోరీ ఈనాటి..ఆనాటిది కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి స్టోరీ. పారంజిత్ ఎంతో రీసెర్చ్ చేసి...ఎన్నో విషయాలు తెలుసుకుని..అప్పటి మనుషులు ఇలా ఉండేవారా? అనే ఓ ఇమేజినేషన్ లోకి వెళ్లి తంగలాన్ సినిమా చేసాడు.
ఈ సినిమా సౌత్ లో బాగానే ఆడింది. తెలుగు ఆడియన్స్ కి నచ్చింది. కానీ పాన్ ఇండియాలో మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఆ స్టోరీగానీ, పాత్రలు గానీ ఏవీ నేషనల్ వైడ్ కనెక్ట్ అవ్వలేదు. అటుపై రిలీజ్ అయిన మరో చిత్రం సూర్య 'కంగువ'. ఈ సినిమా కోసం దర్శకుడు శివ ఎంతో రీసెర్చ్ చేసాడు. స్టోరీ రాయడం కోసమే చాలా సమయం తీసుకున్నాడు. వందల ఏళ్ల క్రితం నాటి కథని హాలీవుడ్ స్టైల్లో తీసే ప్రయత్నం చేసాడు.
కానీ సినిమా ఎక్కడా సరైన ఫలితం సాధించలేదు. ఇక నార్త్ నుంచి అయితే కనీస ఆదరణ కూడా దక్కక్కపోవడం ఆశ్చర్యకరం. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఇది. రిలీజ్ అనంతరం ఏకోణంలోనూ పాజిటివ్ గా కనిపించలేదు. మేకింగ్ పరంగా మాత్రం ఎంతో రిచ్ గా ఉంటుంది. ఈ సినిమా పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుందని సూర్య అండ్ కో చాలా ఆశలు పెట్టుకుంది. కానీ పనవ్వలేదు. ఇక రజనీకాంత్ సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అయినా? కాన్సెప్ట్ లు రొటీన్ కావడంతో కనెక్ట్ అవ్వడం లేదు అన్నది చెప్పొచ్చు. ఈ వైఫల్యాలన్ని కోలీవుడ్ మేకర్స్ లో చర్చకు దారి తీస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ ని ఎలా చేజింక్కుంచుకోవాలి అన్న కసిని పెంచుతున్నాయి.