ఎల్లమ్మ టీం సైలెంట్ కి రీజన్ అదేనా..?

ఐతే ఎల్లమ్మ సినిమాకు వేణుకి మంచి స్టార్ కాస్ట్ ఇస్తున్నాడు దిల్ రాజు. నితిన్, సాయి పల్లవి లాంటి వారు దాదాపు ఓకే అన్నట్టు టాక్.

Update: 2024-12-31 03:44 GMT

బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండి తన రెండో సినిమా ఎల్లమ్మతో రాబోతున్నాడు. ఈసారి దిల్ రాజు వేణు కోరిక కాస్టింగ్, బడ్జెట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. బలగం సినిమాను ప్రియదర్శి, కావ్య తప్ప అందరు కొత్త వారితో లాగించారు. అయినా సరే ఎమోషన్ పండించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఐతే ఎల్లమ్మ సినిమాకు వేణుకి మంచి స్టార్ కాస్ట్ ఇస్తున్నాడు దిల్ రాజు. నితిన్, సాయి పల్లవి లాంటి వారు దాదాపు ఓకే అన్నట్టు టాక్.

నితిన్ తోనే ఎల్లమ్మ అని దిల్ రాజు ఫిక్స్ చేశారు. కొన్నాళ్లుగా ఎల్లమ్మ హీరోగా నాని, శర్వానంద్ ఇలా వరుస చాలా పేర్లు వినిపించగా ఫైనల్ గా నితిన్ ని లాక్ చేశారు. ఇక సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తారు అన్న డిస్కషన్ మొదలైంది. ఐతే సాయి పల్లవి ఎల్లమ్మ టైటిల్ రోల్ పోషిస్తుంది అని గత కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అయ్యింది. వేణు ఎల్లమ్మలో సాయి పల్లవి ఫిక్స్ అంటూ నానా హంగామా చేశారు.

ఐతే ఇంత హడావిడి అవుతున్నా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అంటే దాదాపు సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. అటు హీరోయిన్ సాయి పల్లవి నుంచి కానీ దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కానీ ఎల్లమ్మలో సాయి పల్లవి అంటూ వచ్చిన వార్తలపై స్పందించలేదు. వాళ్లు సైలెంట్ గా ఉన్నారు అంటే అది నిజం అన్నట్టే లెక్క. సాయి పల్లవి నిజంగానే ఎల్లమ్మలో ఉంటే మాత్రం సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అమ్మవారిగా సాయి పల్లవి పర్ఫెక్ట్ అనిపిస్తుంది.

ఇప్పటికే తన పాత్రల ఎంపికలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ వస్తున్న సాయి పల్లవి ఎల్లమ్మ కన్ఫర్మ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఐతే బలగం తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన వేణు ఎల్లమ్మతో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. నితిన్, సాయి పల్లవి, వేణు కాంబోలో రాబోతున్న ఎల్లమ్మ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఎల్లమ్మగా సాయి పల్లవి పోస్టర్ వస్తే మాత్రం సినిమాకు హ్యూజ్ బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News