సెల్ ఫోన్ వల్ల క్యాన్సర్.. అసలు నిజం వెల్లడించిన పరిశోధనలు..

ఒకప్పుడు మన దగ్గర సాంకేతికత చాలా తక్కువగా ఉండేది.

Update: 2024-09-05 16:30 GMT

ప్రస్తుతం టెక్నాలజీ లేకుండా ఏ పని జరగడం లేదు. మరి ముఖ్యంగా చేతిలో సెల్ఫోన్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక నిత్య అవసరంగా మారిపోయింది. అయితే చాలా రోజుల నుంచి అధికంగా సెల్ ఫోన్ వినియోగించడం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఎన్నో ఏళ్లగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. మరోపక్క సమాజంలో దీని పై పలు రకాల అపోహలు కూడా ఉన్నాయి.

ఒకప్పుడు మన దగ్గర సాంకేతికత చాలా తక్కువగా ఉండేది. పరిశోధనలకు అవసరమైన డేటా కూడా చాలా పరిమితి మోతాదులో లభ్యమయ్యేది. అందులో నీ పరిశోధనల ఫలితాలపై ఇది ప్రభావాన్ని చూపించేది. అలాంటి వాటిల్లో ఒకటి మొబైల్ ఫోన్లో రేడియో తరంగాల కారణంగా మెదడు క్యాన్సర్ వస్తుంది అని అపోహ. కానీ తాజాగా నిర్వహించిన ఒక పరిశోధన వీటన్నిటిని తప్పుగా నిరూపించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్) చేయించిన అధ్యయనం ప్రకారం భారీ స్థాయిలో డేటాను విశ్లేషించి మొబైల్ ఫోన్ వినియోగానికి.. మెదడు క్యాన్సర్ కి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాన్ని పరిశోధకులు నిర్ధారించారు. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఈ పరిశోధన నిర్వహించింది. సుమారు 500 అధ్యయనాల నుంచి వెలికి తీసిన డేటాను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు రావడం జరిగింది.

మరి ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా వైర్లెస్ సాంకేతికత ఉత్పత్తులను వాడడం బాగా పెరిగింది. అయితే అదే స్థాయిలో బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధించిన కేసులలో పెరుగుదల లేదు అని ఈ సంస్థ పేర్కొంది. అయితే 2011 మే లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ప్రచురించిన ఒక అధ్యాయనంలో రేడియో తరంగాల కారణంగా క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంది అని పేర్కొంది. అంతేకాదు వైర్లెస్ ఫోన్ల వాడకం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ కు కారణమయ్యే గ్లియోమా కణితి ఏర్పడుతుందని ఆ పరిశోధన తెలిపింది. అయితే తాజాగా నిర్వహించిన పరిశోధనల ప్రకారం వైర్లెస్ పరికరాల నుంచి వెలువడే రేడియో తరంగాలు ఆరోగ్యానికి హాని కలిగించేవి కావు అని స్పష్టమైనది.

Tags:    

Similar News