అధ్యక్ష్యా .. అంటున్న 14 మంది శ్రీనివాసులు !

ఇందులో టీడీపీ నుండి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుండి ఒకరు ఎమ్మెల్యేలుగా గెలిచారు.

Update: 2024-06-06 07:03 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కొత్తగా ఎన్నికైన శాసనసభ, లోక్ సభ సభ్యులలో వివిధ పార్టీల నుండి ఎన్నికైన వారిలో 14 మంది శ్రీనివాస్ అనే పేర్లు కలిగి ఉండడం విశేషం. వీరంతా చట్ట సభలలో అధ్యక్ష్యా అని అనబోతున్నారు. శాసనభకు 11 మంది, లోక్ సభకు ఇద్దరు పోటీ చేసి గెలిచారు.

ఇందులో టీడీపీ నుండి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుండి ఒకరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ, జనసేన, టీడీపీ నుండి ఒక్కొక్కరు చొప్పున లోక్ సభకు ఎన్నికయ్యారు.

టీడీపీ నుండి గజపతి నగరం నియోజకవర్గం నుండి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి నుండి గంటా శ్రీనివాసరావు, గాజువాక నుండి పల్లా శ్రీనివాసరావు, రాజమండ్రి సిటీ నుండి ఆదిరెడ్డి శ్రీనివాస్, తిరువూరు నుండి కొలికపూడి శ్రీనివాసరావు, రాయదుర్గం నుండి కాలువ శ్రీనివాసులు, గురజాల నుండి యరపతినేని శ్రీనివాసరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

జనసేన నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి వంశీక్రిష్ణ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, తిరుపతి నుండి అరణి శ్రీనివాసులు బీజేపీ తరపున కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా, టీడీపీ నుండి ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నుండి నర్సాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాసవర్మ, జనసేన నుండి కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లు గెలిచారు.

Tags:    

Similar News