ఎన్నికల ముందు సినిమా...ఈ వ్యూహం ఆయనదే...!?

చివరికి మూడు నెలల న్యాయ పోరాటం తరువాత వ్యూహం మూవీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

Update: 2024-02-13 19:02 GMT

వ్యూహం అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక పొలిటికల్ మసాలా మూవీని తీసారు. లెక్క ప్రకారం చూస్తే ఈ మూవీ గత ఏడాది నవంబర్ 9న రిలీజ్ కావాలి. అయితే ఈ మూవీని రిలీజ్ కాకుండా టీడీపీ యువ నేత నారా లోకేష్ అడ్డుకున్నారు. కోర్టులకు వెళ్ళారు. చివరికి మూడు నెలల న్యాయ పోరాటం తరువాత వ్యూహం మూవీకి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ నెల 23న వ్యూహం మూవీని 500 వందల థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించిన రాం రామ్ గోపాల్ వర్మ అయితే లోకేష్ వ్యూహానికి థాంక్స్ అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చేశారు. తాను నిర్మాత కలసి డిసెంబర్ లో మూవీ రిలీజ్ అని అనుకున్నామని కానీ లోకేష్ తెలివిగా మాకు సహకరించి సరిగ్గా ఎన్నికల ముందుకు ఈ సినిమా వచ్చేలా చేసారు అని అన్నారు.

అలా తాను ఒక్క లోకేష్ కి రుణపడ్డాను అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇపుడు వ్యూహం టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చెస్తోంది. ఇందులో చూస్తే చంద్రబాబు జగన్ పవన్ చిరంజీవి పాత్రలు కనిపిస్తాయి. ఒక డైలాగులో చంద్రబాబును జగన్ పాత్ర పాము తో పోలిస్తే మరో సన్నివేశంతో పొత్తులో భాగంగా తనకు సీఎం పదవి కావాలని డైరెక్ట్ గా చంద్రబాబునే పవన్ డిమాండ్ చేయడం కనిపిస్తుంది.

ఇక పుంగనూరు లో పోలీస్ వర్సెస్ టీడీపీ ఘర్షణలు పోలీసులకు గాయాలు చంద్రబాబు జైలుకు వెళ్ళడం వంటివి కూడా ఈ టీజర్ లో ఉంచారు. మొత్తానికి ఆసక్తికరంగా టీజర్ ని డిజైన్ చేశారు. వ్యూహం రిలీజ్ అయిన వారం వ్యవధిలో శపధం సినిమా రిలీజ్ అని ఆర్జీవీ చెబుతున్నారు.

వ్యూహం వైఎస్సార్ మరణానంతరం జరిగిన సంఘటనలు జగన్ సీఎం అయ్యేంతవరకూ ఉంటే శపధంలో జగన్ సీఎం అయ్యాక జరిగిన సంఘటనలు అయిదేళ్ల పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు ఉంటాయి. ఈ మూవీ పూర్తిగా తన ఆలోచనల మేరకు తీశాను అని జగన్ కోసం కాదని ఆర్జీవీ అంటున్నారు. అంతే కాదు పవన్ చంద్రబాబుల కోసం సినిమా తీశాను అని చెబుతున్నారు.

ఈ మూవీ ఎన్నికల ముందు రిలీజ్ కావడం వల్ల ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుందా అన్న చర్చ అయితే ఉంది. ఏపీలో ఎన్నికల వేడి రగులుతున్న వేళ వ్యూహం శపధం సినిమాలు వరసగా రావడం వైసీపీ గ్రాఫ్ ని పెంచుతాయా అన్న చర్చ సాగుతోంది. వీటి కంటే ముందు రిలీజ్ అయిన యాత్ర టూ మూవీ కూడా జగన్ కి పాజిటివ్ గానే తీశారు. మొత్తానికి వైసీపీకి ఎన్నికల వేళ స్టార్ కాంపెనియర్స్ లేరు అన్న లోటుని ఈ మూడు సినిమాలు తీర్చేశాయని అంటున్నారు.

Tags:    

Similar News