జగన్ మీద కేసు పెడితే అదానీ మీద పెట్టాలి కదా కూటమి బ్రదర్స్ ?

స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు అయితే జగన్ క్విడ్ ప్రకోలో భాగంగా భారీ అవినీతికి పాల్పడ్డారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అవినీతి మీద సీబీఐ ఏసీసీ విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Update: 2024-11-24 07:21 GMT

అదానీ మీద అమెరికాలో కేసు ఆ మీదట ఆ కేసులో జగన్ ప్రస్తావన నేపథ్యంలో టీడీపీ కూటమికి ఒక ఆయుధం దొరికినట్లు అయింది. జగన్ మీద ప్రతీ దానికీ నల్లేరు మీద బండి మాదిరిగా విరుచుకుపడే కూటమి పెద్దలకు ఇపుడు ఇది అంది వచ్చిన అవకాశంగా మారింది.

దాంతో జగన్ అవినీతి అని క్విడ్ ప్రోకో అని అంతర్జాతీయ స్థాయికి ఆయన అవినీతి అంటూ టీడీపీ నేతల విమర్శలు పాటు అనుకూల మీడియా కూడా బాగానే రాతలు రాస్తోంది. ఇదిలా ఉంటే అదానీ మీద కేసు, అందులో జగన్ కి 1750 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు అన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ మీద కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది అని అంటున్నారు.

స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు అయితే జగన్ క్విడ్ ప్రకోలో భాగంగా భారీ అవినీతికి పాల్పడ్డారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అవినీతి మీద సీబీఐ ఏసీసీ విచారణ జరిపించాలని ఆయన కోరారు. అయితే తాము అదానీతో కాదు సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని వైసీపీ చెబుతోంది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే అని అంటున్నారు. అదానీ కేసుతో సెకీకి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు.

ఇక జగన్ క్విడ్ ప్రోకో తో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది అని ప్రజలపైన అధిక విద్యుత్ భారం పడింది అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇదిలా ఉంటే జగన్ మీద అవినీతి నిరోధక చట్టం కేసుని ఫైల్ చేస్తారని అంటున్నారు.

సోలార్ పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ముడుపుల కేసులో జగన్ ని ప్రాసిక్యూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పీసీ యాక్ట్ కింద జగన్ మీద కేసు నమోదు చేయవచ్చా అన్న దాని మీద చర్చిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. దీని మీద న్యాయ సలహాను తీసుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక చూస్తే ఇప్పటికే అమెరికాలో అదానీ మీద కేసు నమోదు అయింది అన్నది తెలిసిందే. అక్కడ అదానీ మీద వేసిన చార్జ్ షీటు లో జగన్ పేరు ప్రస్తావించారు అని అంటున్నారు. దాంతో జగన్ మీద పీసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే పీసీ యాక్ట్ లోకి 17వ అధికరణం ప్రకారం మాజీ సీఎం ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని అంటున్నారు. దాంతో ఈ విషయంలో ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. ఇదిల ఉంటే జగన్ మీద కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలనుకుంటే అదానీ మీద కూడా కేసులు పెట్టాలి కదా అన్న చర్చ వస్తోంది.

ముందు అదానీ ఉంటారని తరువాతనే జగన్ వస్తారని అలా కాకుండా కేవలం జగన్ మీద కేసులు అంటే అది రాజకీయ కక్ష కిందకే వస్తుందని అంటున్నారు. మరో వైపు చూస్తే అదానీ ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అని అంటున్నారు. దాంతో పాటు ఆయనకు కేంద్ర పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.

దాంతో అదానీని అలా ఉంచి జగన్ మీద కేసు పెట్టినా ఉపయోగం ఏమిటి అని అంటున్నారు. అదే సమయంలో జగన్ మీద కేసు పెట్టినపుడు ఆయన ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది కదా అని కూడా అంటున్నారు.

ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే జగన్ మీద కేసులు అంటూ పెడితే అది వేరే సంకేతాలు ఇస్తుందని కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో అవినీతి జరిగి ముడుపులు అన్నవి ఉన్నాయని పూర్తిగా తేలాలీ అంటే అదానీ మీదనే మొదట కేసు పెట్టాలని అంటున్నారు. మరి ఆ విధంగా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటేనే ఈ కేసులో ఏమి జరిగింది అన్నది బయటకు వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News