అక్కడ జైల్లో ఉద్యోగుల కంటే ఖైదీలకే ఎక్కువ జీతం..

ఇది కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బ్రతకడానికి భరోసా కల్పిస్తుంది అని జైలు శాఖ నమ్ముతుంది.

Update: 2024-11-24 06:10 GMT

సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే జైలుకు పంపుతారు.. అయితే అలా జైలుకు వెళ్లిన వారు జైలు ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అన్న విషయం మీకు తెలుసా? వినడానికి విచిత్రంగా ఉన్న అది నిజం. మామూలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో పరివర్తన తీసుకురావడం కోసం వారి చేత చిన్న చిన్న పనులు చేయిస్తూ ఉంటారు. అలా చేయించిన పనుల ద్వారా వచ్చిన కొంత మొత్తాన్ని ఖైదీల ఆదాయం కింద జమ చేసి వారి విడుదల సమయంలో వారికి అందిస్తారు. ఇది కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు బ్రతకడానికి భరోసా కల్పిస్తుంది అని జైలు శాఖ నమ్ముతుంది.

అయితే యూకే లో మాత్రం జైలులో ఉన్న ఖైదీలు పొందుతున్న ఉపాధి అక్కడ పనిచేస్తున్న అధికారుల జీతాల కంటే ఎక్కువ అన్న విషయం తాజాగా వైరల్ అయింది. అయితే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. యూకే జైల్స్ లో రూల్స్ మన వాటికంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఒకసారి జైలుకు వెళ్తే అయితే బెయిల్ మీద లేకపోతే విడుదలయ్యాక మాత్రమే ఖైదీలు బయటికి వస్తారు.

కానీ యూకేలో బహిరంగ జైళ్లలో ఉన్న ఖైదీలు బయటకు వెళ్లి పనిచేసుకునే అవకాశం ఉంటుంది . ఆ విధంగా అక్కడ ఖైదీలు బయటకు వెళ్లి వివిధ రకాల ఉద్యోగాలు చేసుకొని అధిక మొత్తంలో జీతం సంపాదిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే అక్కడ జైల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు,బయోకెమిస్ట్లు, సైకోథెరపిస్ట్ల కంటే కూడా ఖైదీలు ఎక్కువే సంపాదిస్తున్నారు.

జైల్ నుంచి బయటకు వచ్చే పని చేసే వారిలో చాలామంది లారీలు, బస్సులు సైతం నడుపుతున్నారు. శిక్షాకాలం ముగిసే సమయానికి వీరికి తాత్కాలిక లైసెన్స్ కూడా వచ్చేస్తోంది.అత్యధికంగా వీరిలో కొంతమంది $46,005 అంటే మన కరెన్సీ లో 38,84,491 రూపాయలు సంపాదిస్తున్నారు. మరోపక్క జైల్లో గార్డ్ గా పనిచేసే వ్యక్తి జీతం $35,085 అంటే సుమారు 29,62,446 అన్నమాట. కొందరు ఖైదీల తమ సంపాదనలో కొంత మొత్తాన్ని స్వచ్చంద సంస్థలకు కూడా అందిస్తున్నారట. ఇలా బయటకి వెళ్లి పనిచేయడం శిక్షకాలం ముగిసి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచిగా మెలగడానికి వారికి ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు జైలు అధికారులు.

Tags:    

Similar News