58.35 గంటల ముద్దుతో రికార్డ్.. కట్ చేస్తే ఈ జంట విడాకులు
ప్రేమకు ప్రతీకగా నిలిచిన థాయ్‌లాండ్ జంట ఇక్కా చాయ్ - లక్సానా ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది.;
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 58 గంటలు ముద్దుపెట్టుకున్నారు. తమ అన్యోన్యత.. బంధం గాఢతను తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ 1 కిస్సింగ్ కపుల్ గా నిలిచారు. కట్ చేస్తే.. ప్రేమకు ప్రతీకగా నిలిచిన థాయ్‌లాండ్ జంట ఇక్కా చాయ్ - లక్సానా ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రికార్డుల్లో నిలిచిన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే వారు విడాకుల వెనుక ఉన్న కారణాలను వెల్లడించలేదు.
-లాంగెస్ట్ ముద్దుతో ప్రపంచ రికార్డ్
ఈ జంట 2013లో ప్రేమను నిరూపించుకునేలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వీరు 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లపాటు ముద్దు పెట్టుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ పోటీలో పాల్గొన్న ఈ జంట అసాధారణమైన దీక్షను ప్రదర్శించింది. వారి ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
- విడాకుల ప్రకటన
అయితే తాజాగా వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో వారి అభిమానులు షాక్‌కు గురయ్యారు. చాలా కాలంగా ప్రేమను నిలబెట్టుకున్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నది అనే విషయం తెలియరాలేదు. కానీ, వీరి సంబంధం ముగిసిందన్న వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక్కా చాయ్ - లక్సానా జంట ముద్దు రికార్డుతో మాత్రమే కాకుండా, ప్రేమకు అంకితభావంతో కూడిన ఒక మంచి జంటగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు వారి విడాకుల ప్రకటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో కొంతకాలం అద్భుతమైన ప్రేమ కథగా నిలిచిన వీరి జీవితం ఇంత రసవత్తర మలుపు తిరగడం అందరికీ కలచివేసే వార్తగా మారింది.