ఓ రైలుకి ఓనర్ అయిన రైతు.. అసలు స్టోరీ అదే..
అవును వినడానికి విచిత్రంగా ఉన్న ఈ సంఘటన పంజాబ్ లోని లుథియానాలో చోటు చేసుకుంది.
సాధారణంగా బాగా డబ్బులు సంపాదించిన వారు తమ పేరుతో బంగ్లాలు ,కార్లు ఆఖరికి విమానాలు, హెలికాప్టర్లు, ఓడలు కూడా ఖరీదు చేయడం మనకు తెలుసు. అయితే ఓ రైతు ఏకంగా రైలునే తన సొంతం చేసుకున్నాడు అంటే మీరు నమ్ముతారా. అవును వినడానికి విచిత్రంగా ఉన్న ఈ సంఘటన పంజాబ్ లోని లుథియానాలో చోటు చేసుకుంది. అయితే ప్రభుత్వ ఆస్తిగా భావించే రైలు ఒక రైతు పేరు మీద ఎలా ఉంది అని మీకు డౌట్ రావచ్చు? ఇది రైల్వే అధికారుల తప్పిదం కారణంగా జరిగిన ఓ చిన్న పొరపాటు.
ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించబడే భారతీయ రైల్వేలో అధికారులు చేసిన ఒక పొరపాటుతో స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలును ఓ రైతు ఖాతాలోకి వెళ్లేలా చేసింది. రైల్వే చరిత్రలో నిజంగా ఇది ఒక అసాధారణ ఘటనే.2007 లో
లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ నిర్వహించారు. ఈ క్రమంలో కటానా గ్రామంలో రైల్వే లైన్ కోసం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
అయితే తన పక్క గ్రామంలో రైతులకు ప్రభుత్వం ఎకరానికి 71 లక్షలు ఇచ్చినట్లుగా తెలుసుకున్న సంపూరణ్ సింగ్ అనే రైతు ఇదే విషంపై కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని అంతటితో వదలకుండా అతని దీనిపై న్యాయపోరాటం చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ 25 లక్షల పరిహారాన్ని 50 లక్షలకు పెంచారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో పరిహారం 1.47 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్త్ రైల్వే 2017 లోగా చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయినా సరే తనకు అందాల్సిన పరిహారం అందకపోవడం సంపూరణ్ సింగ్ పూర్తి పరిహారం కోసం మళ్లీ కోర్టు తలుపులు తట్టాడు. తనకు చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 42 లక్షల మాత్రమే చెల్లించినట్టుగా అతని కోర్టుకు తెలిపాడు.దీనిపై తీవ్రంగా స్పందించిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని తీర్పును వినిపించారు. ఢిల్లీ-అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెప్రెస్ తో పాటు లుథియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్ కూడా జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో భారత దేశ చరిత్రలో ఓ రైలుకి యజమానిగా మారిన ఏకైక రైతుగా సంపూరణ్ సింగ్ చరిత సృష్టించాడు.