కలెక్టర్ ఆఫీసులో అధికారికి యువతి న్యూడ్ కాల్... వాట్ నెక్స్ట్ అంటే..?
రోజు రోజుకీ వీటి బారిన పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు.
సైబర్ నేరగాళ్ల సమస్య ఇప్పుడు చిన్నా పెద్దా అనే తారతమ్యాలేమీ చూపించకుండా అందరినీ వేదిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ వీటి బారిన పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా కలెక్టర్ ఆఫీసులోని ఓ అధికారి వీరి బారిన పడ్డ సంఘటన తాజాగా చోటు చేసుకుంది.
అవును... ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు జడలు విప్పుతున్న సంగతి తెలిసిందే! కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా సాగిన వ్యవహారం.. కారెవరూ సైబర్ బాడులకు అనర్హం అన్నట్లుగా మారిందని చెబుతున్నారు. ఈ సమయంలో జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులోని ఓ శాఖకు చెందిన అధికారికి ఈ అనుభవం ఎదురైంది.
ఇందులో భాగంగా... కలెక్టర్ ఆఫీసులో పనిచేసే అధికారికి ఓ యువతి సెల్ ఫోన్ లో వీడియో కాల్ చేసింది. అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ న్యూడ్ గా మారిపోవడం మొదలుపెట్టింది. దీంతో... కంగారు పడిన అధికారి ఫోన్ కట్ చేశారట. అనంతరం.. సైబర్ నేరగాళ్లు డ్యూటీ ఎక్కారు! ఇందులో భాగంగా భారీగా డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
ఇదే సమయంలో ఇప్పటివరకూ మాట్లాడిన వీడియో కాల్ రికార్డ్ అయ్యిందని.. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశామని.. దాన్ని తొలగించాలంటే ముందుగా రూ.35 వేలు పంపాలని కోరారట. అనంతరం... మరో వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను సైబర్ క్రైం అధికారిగా పరిచయం చేసుకుని భయపెట్టే ప్రయత్నం చేశాడని అంటున్నారు.
దీంతో.. విషయం గ్రహించిన అధికారి తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డట్లు గ్రహించి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు! ఈ సమయంలో... తెలియని వ్యక్తుల వీడియో కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. సందేహాలు వస్తే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.