టీమిండియా పై పాకిస్థాన్ పై చేయి... ఈ షాకింగ్ వాస్తవాలు తెలుసా?

అయితే... 2018 నుంచి మాత్రం ఇరుజట్ల మధ్య ఆరు మ్యాచ్ లు జరగ్గా ఆరింటిలోను భారత్ విజయబావుటా ఎగురవేసింది.

Update: 2025-02-23 05:54 GMT

ఐసీసీ టోర్నీ ఏదైనా.. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ, ఆసక్తి లెక్కే వేరని చెప్పాలి! ఈ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురుచూస్తుంటుంది.. ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రమంలో... చాలా కాలంగా భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుందని అంటారు.

ఇక ఈ తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై మరింత ఒత్తిడిలో ఉందని చెబుతున్నారు. పైగా... సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను మట్టికరిపించి, ఈ టోర్నీలో తొలిమ్యాచ్ లో బంగ్లాను ఓడించి మంచి ఊపుమీద కనిపిస్తుంది టీమిండియాకు. ఇవన్నీ భారత్ కు శుభసూచికాలే కానీ... ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ పై పాక్ దే పై చేయిగా ఉంది!

అవును... గత కొంతకాలంగా భారత్ తో మ్యాచ్ అంటే పాకిస్థాన్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందనే సంగతి తెలిసిందే. వారి పెర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్లుగానే ఉంటుంది. అయితే... ఒక్కసారి వెనక్కి వెళ్తే... ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టుపై పాకిస్థాన్ దే పై చేయిగా ఉన్న పరిస్థితి. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!

వాస్తవానికి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ - పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో భాగంగా... 2004, 2009, 2013, 2017లో రెండు సార్లు ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలబడ్డాయి. అయితే... ఈ ఐదు సార్లలో మూడు సార్లు పాకిస్థాన్ నే విజయం వరించింది. చివరిగా 2017లో భారత్ ను పాక్ దెబ్బకొట్టింది.

ఇందులో భాగంగా... 2004 లో బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు మూడు వికెట్ల తేడాదో విజయం సాధించగా.. 2009లో సెంచూరియా వేదికగా మరోసారి 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే... 2013లో బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మాత్రం టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ క్రమంలో అదే మైదానంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో పాక్ పై టీమిండియా 124 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఓవెల్ వేదికగా ఆ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మాత్రం పాక్ ఏకంగా 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ట్రోఫీని సొంతం చేసుకుంది. దీనికి భారత్ రివేంజ్ తీర్చుకుంటే.. ఈ ట్రోఫీ నుంచి పాక్ బయటకు వెళ్లినట్లే..!

హెడ్ టు హెడ్ రిజల్ట్స్!:

ఇక వన్డే లలో ఇరు జట్ల హెడ్ టు హెడ్ మ్యాచ్ లలోనూ పాక్ దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ భారత్ – పాక్ ల మధ్య 135 వన్డేలు జరగ్గా.. అందులో పాకిస్థాన్ 73 గెలవగా.. టీమిండియా 57 మ్యాచ్ లలో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్ లు ఫలితం తేలలేదు. అయితే... 2018 నుంచి మాత్రం ఇరుజట్ల మధ్య ఆరు మ్యాచ్ లు జరగ్గా ఆరింటిలోను భారత్ విజయబావుటా ఎగురవేసింది.

భారత్ – పాక్ వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు!:

సచిన్ టెండుల్కర్ - 69 మ్యాచ్ లు - 2526 పరుగులు (141 బెస్ట్)

ఇంజమామ్మ్ ఉల్ హక్ - 67 మ్యాచ్ లు - 2403 పరుగులు (123 బెస్ట్)

సయీద్ అన్వర్ - 50 మ్యాచ్ లు - 2002 పరుగులు (194 బెస్ట్)

రాహుల్ ద్రావిడ్ - 58 మ్యాచ్ లు - 1899 పరుగులు (107 బెస్ట్)

షోయబ్ మాలిక్ - 42 మ్యాచ్ లు - 1782 పరుగులు (143 బెస్ట్)

భారత్ – పాక్ వన్డేల్లో అత్యధిక వికెట్ల వీరులు!:

వసీం అక్రం - 48 మ్యాచ్ లు - 60 వికెట్లు (4/35 బెస్ట్)

సక్లైన్ ముస్తక్ - 36 మ్యాచ్ లు - 57 వికెట్లు (5/45 బెస్ట్)

అకీబ్ జావెద్ - 39 మ్యాచ్ లు - 54 వికెట్లు (37/7 బెస్ట్)

అనిల్ కూంబ్లే - 34 మ్యాచ్ లు - 54 వికెట్లు (4/12 బెస్ట్)

జవగళ్ శ్రీనాథ్ - 36 మ్యాచ్ లు - 54 వికెట్లు (4/49 బెస్ట్)

Tags:    

Similar News