200..200..11 వేలు..14 వేలు(మిస్)..టీమిండియా స్టార్స్ సూపర్ స్టాట్స్
ఒక్క మ్యాచ్ లో ఒక ఆటగాడు మైలురాయిని అందుకున్నాడంటే అది సహజం.. ఇద్దరు ఆటగాళ్లు రికార్డులకు ఎక్కడం కొంచెం అరుదు.. ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఒకే మ్యాచ్ లో కీలక గణాంకాలు నమోదు చేస్తే అది అద్భుతమే..
ఒక్క మ్యాచ్ లో ఒక ఆటగాడు మైలురాయిని అందుకున్నాడంటే అది సహజం.. ఇద్దరు ఆటగాళ్లు రికార్డులకు ఎక్కడం కొంచెం అరుదు.. ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఒకే మ్యాచ్ లో కీలక గణాంకాలు నమోదు చేస్తే అది అద్భుతమే.. చాంపియన్స్ ట్రోఫీతో బంగ్లాదేశ్ తో గురువారం మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియా స్టార్లు ఇలా చరిత్రలో నిలిచిపోయారు.
11 వేలు రెండో ఫాస్టెస్ట్
టి20లు, వన్డేల్లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి ఆటగాడో అందరికీ తెలిసిందే. నిరుడు టి20లకు వీడ్కోలు పలికిన అతడు చాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక వన్డేలకూ గుడ్ బై చెబుతాడని భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడు వన్డే కెరీర్ లో 11 వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. రోహిత్ 261 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించాడు. కోహ్లి (222 ఇన్నింగ్స్) ముందున్నాడు. 11 వేల వన్డే పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్ రోహిత్. ఇతడి కంటే ముందు సచిన్, గంగూలీ కోహ్లి ఉన్నారు.
షమీ 200..
వన్డే ప్రపంచ కప్ లో అదరగొట్టి ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తిరిగొచ్చి అదరగొడుతున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు. దీంతో అతడు ఐసీసీ ఈవెంట్లలో 60 వికెట్లు తీసినట్లయింది. భారత్ తరఫున ఇవే అత్యధికం.
జడేజాకూ 200
కోహ్లి, రోహిత్ తో పాటే గత ఏడాది టి20 ప్రపంచ కప్ నకు గుడ్ బై చెప్పిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ద్వారా 200వ వన్డే ఆడాడు. ఈ ఫార్మాట్లో 226 వికెట్లు పడగొట్టిన జడేజా.. 2,779 పరుగులు సాధించాడు.
కోహ్లి 14 వేలు మిస్..
ఇక టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా బంగ్లాతో మ్యాచ్ లో అరుదైన గణాకాంలను అందుకునేవాడే. అతడు మరో 37 పరుగులు చేసి ఉంటే వన్డేల్లో 14 వేల పరుగులు చేసినవాడిగా చరిత్రలో నిలిచేవాడు. ఇప్పటివరకు 298 మ్యాచ్ లలో 286 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 13,985 పరుగులు సాధించాడు.
వన్డేల్లో అత్యధికంగా సచిన 18,426 పరుగులు చేయగా.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో కోహ్లి నిలకడగా ఆడితే సంగక్కరను దాటేసే చాన్స్ లేకపోలేదు.