చాంపియన్స్ ట్రోఫీ : రికార్డులు బద్దలు కొట్టిన షమీ

50 ఓవర్ల ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసేందుకు షమీ ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ కంటే తక్కువ బంతులు వేసి ఈ ఘనత సాధించాడు.

Update: 2025-02-20 12:43 GMT

టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ రికార్డులు బద్దలు కొట్టాడు. తన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రస్థానాన్ని ఒక మైలురాయితో ప్రారంభించాడు. వన్డేల్లో 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన అనంతరం షమీ ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన 200 వికెట్ల రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అగార్కర్, జహీర్, కుంబ్లే రికార్డులను బద్దలు కొట్టాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసేందుకు షమీ ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ కంటే తక్కువ బంతులు వేసి ఈ ఘనత సాధించాడు.

గురువారం, దుబాయిలో జరిగిన బంగ్లాదేశ్‌తో ఇండియా గ్రూప్ ఏ మ్యాచ్‌లో షమీ ఈ ఘనతను అందుకున్నాడు. షమీ ఈ రికార్డును సాధించడానికి స్టార్క్ కంటే రెండు మ్యాచులు ఎక్కువ ఆడినా, బంతుల పరంగా తక్కువ బౌలింగ్ చేసి ఘనత సాధించాడు.

ఇదే కాకుండా షమీ టీమిండియా తరఫున అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా అజిత్ అగార్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అగార్కర్ 2004లో 133 మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు.

షమీ తన మూడో వికెట్ తీసినప్పుడు ఈ రికార్డును అందుకున్నాడు. జాకెర్ అలీ , తౌహిద్ హ్రిదోయ్‌ల మధ్య 154 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. షమీ జాకెర్ అలీని అవుట్ చేసి భారత్‌కు కీలకమైన బ్రేక్ తేచ్చాడు.

బంగ్లాదేశ్ 9వ ఓవర్‌లో 35/5 స్కోరుకు పడిపోయింది. అయితే, కొన్ని క్యాచ్‌లు డ్రాప్ కావడం, మిస్డ్ ఛాన్సులు రావడంతో జాకెర్ అలీ - తౌహిద్ హ్రిదోయ్ మెల్లగా, స్థిరంగా భాగస్వామ్యాన్ని నిర్మించగలిగి బంగ్లాదేశ్ భారీ స్కోరుకు బాటలు వేశారు.

- వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు:

మహమ్మద్ షమీ - 5126 బంతులు - 104 మ్యాచ్‌లు

మిచెల్ స్టార్క్ - 5240 బంతులు - 102 మ్యాచ్‌లు

సక్లైన్ ముష్తాక్ - 5451 బంతులు - 104 మ్యాచ్‌లు

బ్రెట్ లీ - 5640 బంతులు - 112 మ్యాచ్‌లు

ట్రెంట్ బౌల్ట్ - 5783 బంతులు - 107 మ్యాచ్‌లు

-వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ‘భారత బౌలర్లు’

మహమ్మద్ షమీ - 103 ఇన్నింగ్స్ లు

అజిత్ అగార్కర్ - 133 ఇన్నింగ్స్ లు

జహీర్ ఖాన్ - 144 ఇన్నింగ్స్

అనిల్ కుంబ్లే - 147 ఇన్నింగ్స్ లు

జవగల్ శ్రీనాథ్ - 147 ఇన్నింగ్స్ లు

కపిల్ దేవ్ - 166 ఇన్నింగ్స్ లు

జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో షమీ భారత బౌలింగ్ దళాన్ని నడిపించాడు. షమీ కొత్త బంతితో బౌలింగ్ చేసి, సౌమ్య సర్కార్ , మెహిదీ హసన్ మిరాజ్ వికెట్లను తీయడంతో మంచి రిథమ్‌లో కనిపించాడు.

2023 వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన తర్వాత షమీ సంవత్సరకాలం పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కోలుకునే దశలోనే మళ్లీ మోకాలి గాయం రావడంతో అతని రీ-కమ్‌బ్యాక్ ఆలస్యమైంది.

జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లో షమీ తన రీ-ఎంట్రీ చేశాడు. ఇప్పుడు, ఈ టోర్నమెంట్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ తను వికెట్ల వేట కొనసాగించాలని చూస్తున్నాడు.

Tags:    

Similar News