ఐపీఎల్-2025 షెడ్యూల్ ఇదే... సన్ రైజర్స్ మ్యాచ్ లు ఎప్పుడెప్పుడంటే..?

అవును... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ సందర్భంగా... 65 రోజులపాటు క్రికెట్ ఫ్యాన్స్ ని అలరించనుంది.

Update: 2025-02-16 16:42 GMT

క్రికెట్ అభిమానులు.. ప్రధానంగా భారతీయ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ – 2025) షెడ్యూల్ వచ్చేసింది. ఈ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ మార్చి 22 నుంచి మే 25 వరకూ జరగనుంది. ఈ సీజన్ 65 రోజులపాటు జరగనుండగా.. మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి.


అవును... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ సందర్భంగా... 65 రోజులపాటు క్రికెట్ ఫ్యాన్స్ ని అలరించనుంది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ క్రికెట్ పండుగలో భాగంగా... తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడనున్నాయి.


ఈ సీజన్ లో రెండో మ్యాచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్.. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మార్చి 23న జరగనుంది. ఈ క్రమంలో మార్చి 22 నుంచి మే 18 వరకూ 70 లీగ్ మ్యాచ్ లు జరగనుండగా.. మే 20 నుంచి 25 వరకూ 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్ ల వివరాలు!:

మార్చి 23 - సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్

మార్చి 27 – లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ వర్సెస్ - హైదరాబాద్

మార్చి 30 - సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - విశాఖపట్నం

ఏప్రిల్ 3 - కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ – కోల్ కతా

ఏప్రిల్ 6 – సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ - హైదరాబాద్

ఏప్రిల్ 12 - పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ - హైదరాబాద్

ఏప్రిల్ 17 – సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ - ముంబై

ఎప్రిల్ 23 - ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ - హైదరాబాద్

ఏప్రిల్ 25 - సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ - చెన్నై

మే 2 – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ - అహ్మదాబాద్

మే 5 - సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్

మే 13 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ - బెంగళూరు

మే 18 - సన్ రైజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైట్స్ - లక్నో

Tags:    

Similar News