పార్లమెంటులో ఏపీ లిక్కర్ మంటలు!

ఆయనకు కౌంటరుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేయడంతో లోక్ సభలో కాసేపు లిక్కర్ మంటలు చెలరేగాయి.

Update: 2025-02-11 12:40 GMT

ఏపీలో లిక్కర్ స్కాం పార్లమెంటులో వాడివేడి చర్చకు దారితీసింది. గత ఐదేళ్ల పాలనలో భారీ కుంభకోణం జరిగిందని, ఢిల్లీ లిక్కర్ స్కాంను మించి పదిరెట్లు ఎక్కువ అవినీతి జరిగిందని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. ఆయనకు కౌంటరుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేయడంతో లోక్ సభలో కాసేపు లిక్కర్ మంటలు చెలరేగాయి.

లోక్ సభ జీరో అవర్ లో మాట్లాడిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్.. ఏపీ లిక్కర్ స్కాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య వైసీపీ పూర్తిగా లిక్కర్ విధానాన్ని మార్చివేసిందని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేయడమే కాకుండా, పూర్తిగా నగదు రూపంలోనే విక్రయాలు జరిగాయని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా, జోక్యం చేసుకున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. సీఎం రమేశ్ బీజేపీ కోసం కాకుండా టీడీపీకి పనిచేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

లోక్ సభలో లిక్కర్ స్కాంపై చర్చ జరగడంతో దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ సంచలనం అవుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ను నియమించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలోని కొందరు కీలక ప్రజాప్రతినిధులకు ఈ స్కాంలో పాత్ర ఉందని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నేడో రేపో ఈ కేసులో అరెస్టులు ఉంటాయని చెబుతుండగా, ఏకంగా పార్లమెంట్ వేదికగా చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కాంలో రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Tags:    

Similar News