ఏపీ అప్పుల్లో మునిగిందా... షాక్ ఇచ్చిన కేంద్రం

ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, అంతే కాకుడా ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటేసిందని విమర్శించారు. అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి.

Update: 2023-07-31 14:00 GMT

ఏపీ అంటే అప్పులు. అ అంటే అప్పులు అని విపక్షాలు తెగ ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఏపీ అప్పుల మయం ఇక దివాళా తీసిన రాష్ట్రం అని బోర్డు కట్టి రాసుకోవడమే తరువాయి అని కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శల జల్లు కురిపిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్లమెంట్ జరిగిన ప్రతీ సారీ ఏపీ అప్పుల మీద అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తూ ఉంటారు.

రీసెంట్ గా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి ఒకరిని బీయారెస్ ఎంపీ అయిన నామా నాగేశ్వరరావు రెండు తెలుగు రాష్ట్రాల అప్పులను గురించి ప్రశ్నించారు. అపుడు కూడా కేంద్రం దానికి స్పష్టమైన వివరణ ఇచ్చింది. నాలుగు లక్షల కోట్లు మాత్రమే ఏపీ అప్పు అని తేల్చింది. ఈ మధ్యనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కలసి వచ్చారు. ఏపీ అప్పుల పుట్ట అంటూ ఒక చిట్టాను కూడా విశాఖ లో జరిగిన మీడియా మీట్ లో చెప్పుకొచ్చారు.

ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ వంతు అన్నట్లుగా రఘురామరాజు సోమవారం పార్లమెంట్ లో ఏపీ అప్పుల గురించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, అంతే కాకుడా ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటేసిందని విమర్శించారు. అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి. ఏమిటి అన్న విషయం ఏపీ ప్రభుత్వం లెక్క చెప్పడం లేదని కూడా ఆయన విమర్శించారు.

దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి క్లారిటీతో లెక్క జమా అన్నీ తేల్చి చెప్పారు.ఇక చూస్తే ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం గడువు ముగిసే లోగా ఉన్న అప్పు అంటే టీడీపీ చేసిన అప్పుగా 2019 మార్చి నాటికి అక్షరాలా రెండు లక్షల 64 వేల 451 కోట్ల రూపాయలు అని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇక 2019 మే 30 నుంచి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పు చూస్తే ఈ నాలుగేళ్ల కాలంలో నాలుగు లక్షల 42 వేల 442 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లుగా నిర్మలమ్మ తెలిపారు. ఇందులో టీడీపీ హయాంలో చేసిన అప్పు 2, 64, 451 కోట్ల రూపాయలను తీసివేస్తే వైసీపీ సర్కార్ చేసిన అప్పుల్ అక్షరాలా ఒక కోటీ 77 వేల 991 కోట్ల రూపాయలుగా కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేశారు.

అదే టైం లో ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటలేదని కూడా కేంద్రం చెప్ప్పడం మరో విశేషం. ఇది ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ భారీ ఊరటగానే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ అప్పుల కుప్ప అన్న అంశం మీదనే విపక్షాలు మరో పదునైన ఆయుధాన్ని రెడీ చేసుకుని జనంలోకి వెళ్తున్నాయి.

అయితే టీడీపీ ఏలుబడిలో కంటే వైసీపీ పాలనలో అప్పు తక్కువ అన్నది కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాలు బట్టి అర్ధం అవుతోంది అని అంటున్నారు. మరి ఏపీ అప్పు మీద విపక్షాలు తమ రాద్ధాంతాన్ని ఇంతటితో ఆపుతాయా లేక ఇంకా యాగీ చేస్తాయా అన్నది చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News