ఏపీ క్యాబినెట్ భేటీ.. మహిళలకు, బీసీలకు భారీ గుడ్ న్యూస్!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.

Update: 2025-02-06 10:43 GMT

ఏపీ సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ సమయలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయుత అందించేలా పాలసీల్లో సవరణలకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది.

అవును... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... ఎం.ఎస్.ఎం.ఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఈడీపీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన సుమారు రూ.45,000 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ మీటింగ్ లో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది.

ఇదే సమయంలో... తిరుమల తిరుపతి దేవస్థానంలో పోటు కార్మికులకు సంబంధించిన 15 పోస్టులను సూపర్ వైజర్ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అదేవిధంగా... పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ కింద నిర్మించే గృహాలకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... గతంలో టీడీపీ సర్కార్ చేపట్టిన ‘నీరు-చెట్టు’ పనులకు సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఇక.. ఏపీలో మద్యం ధరలపైనా క్యాబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం.

Tags:    

Similar News