డిస్ క్వాలిఫై చేస్తారా... చంద్రబాబుకు.జగన్ మార్క్ సవాల్ !

కానీ జగన్ విషయమే తీసుకుంటే ఆయన మొదటి రోజు నుంచే సభకు గైర్ హాజరు అవుతున్నారు. మరి ఇది ఏమైనా అనర్హత వేటుకు చాన్స్ ఉందా అన్నదే చర్చగా ఉంది.

Update: 2024-11-14 03:43 GMT

వైసీపీ అధినేత జగన్ లో ఆవేశం పాలు ఉంటుందన్నది మీడియాకు చాలా తక్కువ తెలుసు అంటారు. ఆయన ఎక్కడా తన ఎమోషన్ ని బయట పెట్టనీయరు. అయితే జగన్ తన పార్టీ నేతలతో నిర్వహించే సమావేశాలలో తనలోని అసహనం ఏదైనా ఉంటే బయటపెడుతూంటారు అన్నది ప్రచారంలో ఉన్న మాట.

ఇదిలా ఉంటే ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ మీద జగన్ మీడియా ముఖంగా రియాక్ట్ అయ్యారు. ఆయన అసెంబ్లీకి ఎటూ వెళ్ళడం లేదు. అంతే కాదు తాను సభకు వెళ్తే మైకు ఇవ్వరని ఆయనే చెప్పారు.

అందుకే తాను మీడియా ముందుకు వచ్చి అసెంబ్లీలో ప్రభుత్వం తీరుని అలా ఎండగడతాను అని ముందే చెప్పారు. దానికి తగినట్లుగా జగన్ మీడియా ముందుకు వచ్చి కూటమి బడ్జెట్ మీద ఆ సర్కార్ విధానాల మీద గట్టిగానే విరుచుకునిపడ్డారు.

అంతే కాదు చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గురించిన విషయాలు అన్నీ గతంలో ఆయన ఏమేమి అన్నారో పేపర్ క్లిప్పింగ్స్ అలాగే సీఎం కాగానే ఆయన అసెంబ్లీలో చేసిన స్పీచ్ గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అన్నీ ఇచ్చి మీడియాకు బాబు ఏంటో అన్నది తనదైన కోణంలో విమర్శలు చేసి ఇవే నిజాలు అని చెప్పారు.

సరే బాబు ప్రెస్ మీట్ ముగిసింది, ఆయన సీటు లో నుంచి లేవబోతూంటే మీడియా ప్రతినిధి ఒకరు ఆయన సభకు రాకపోతే డిస్ క్వాలిఫై చేస్తారుట అని ఒక మాట అన్నారు. అంతే జగన్ లో ఆవేశం కనిపించింది. ఆయన వెంటనే కోపంగా చంద్రబాబుకు నేను సవాల్ చేస్తున్నా నన్ను డిస్ క్వాలిఫై చేయమను అని బిగ్ సౌండ్ చేశారు.

డిస్ క్వాలిఫై చేసే అధికారం వీరి చేతిలో లేదని ఏమనుకుంటున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. తాను అసెంబ్లీకి రాకపోతే తన ఎమ్మెల్యే సభ్యత్వ రద్దు అవుతుందని వస్తున్న వార్తల మీద మీడియా అడిగిన దానికి జగన్ ఇలా రియాక్షన్ ఇచ్చారు. అయితే రూల్స్ ఏమి చెబుతున్నాయో చూస్తే అసెంబ్లీకి రాని సభ్యులు నిర్దిష్ట కాల పరిమితిలోగా సంతకాలు అయినా చేయాలి. లేకపోతే దాని మీద ఏమైనా చర్యలు ఉంటాయా అన్నది ఉంది.

అయితే ఇప్పటిదాకా సభకు హాజరు కాని సభ్యుల విషయంలో ఈ తరహా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ రెండున్నర ఏళ్ళు, వైఎస్సార్ చివరి ఏడాది, చంద్రబాబు రెండున్నరేళ్ళు, జగన్ రెండేళ్లు ఇలా అసెంబ్లీకి రాకుండానే దూరం పాటించారు.

అయితే అదంతా వారు కొన్నాళ్ళ పాటు సభకు వచ్చి తమను అవమానం జరిగిందని కారణాలు చూపించారు. కానీ జగన్ విషయమే తీసుకుంటే ఆయన మొదటి రోజు నుంచే సభకు గైర్ హాజరు అవుతున్నారు. మరి ఇది ఏమైనా అనర్హత వేటుకు చాన్స్ ఉందా అన్నదే చర్చగా ఉంది.పైగా ఏపీలో వైసీపీ టీడీపీల మధ్య ఉప్పు నిప్పుగా వ్యవహారం ఉంది. అంతే కాదు జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదని జనంలోనూ అసంతృప్తి ఉందని అంటున్నారు. జనం మూడ్ ని చూసి ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉదని అంటున్నారు.

Tags:    

Similar News