ఏపీలో ఎన్నికలు... ఆ ఒక్కటీ తక్కువైందా...!?

కానీ వారితో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానించే జనాలు కానీ కనిపించడం లేదు. ఏదో సో సోగా ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి

Update: 2024-04-07 01:30 GMT

ఏపీలో ఎన్నికలు అంటే ఎలా ఉండాలి. ఎక్కడ చూసినా హడావుడి ఏ రేంజిలో ఉండాలి. కానీ జరుగుతున్నది చూస్తే మాత్రం అసలు ఏపీలో ఎన్నికలు ఉన్నాయా అని అనిపించక మానదు. రాజకీయ పార్టీలకు తప్పదు కాబట్టి అధినేతలు బయటకు వస్తున్నారు ఇక అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చి చమటోడుస్తున్నారు.

కానీ వారితో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానించే జనాలు కానీ కనిపించడం లేదు. ఏదో సో సోగా ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు ఉన్నాయి. అంటే మే 13న అన్న మాట. ఇప్పటికి చూస్తే కచ్చితంగా 36 రోజులు మాత్రమే ఉంది. ఇక ప్రచారానికి గడువు చూస్తే అయిదు వారాల కంటే తక్కువ ఉంది.

కానీ ఏపీలో ప్రచారం అయితే ఊపందుకోలేదు. వేవ్ అయితే అసలు కనిపించడంలేదు ఎన్నికలు పట్ల జనంలో ఆసక్తి తగ్గిందా లేక ఏ రాయి అయితేనేమి పళ్ళూడకొట్టుకోవడానికి అన్నట్లుగా భావిస్తున్నారా అన్నది తెలియడంలేదు.

అటూ ఇటూ అధినేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా వేవ్ అన్నది మాత్రం క్రియేట్ కావడం లేదు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటే ఈ రోజుకీ అది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే అంతా రొటీన్ అన్న భావన ఉంది. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నది 2014 నాటి సన్నివేశాన్ని గుర్తుకు తెస్తోంది.

దాంతో జనాలకు పెద్దగా అట్రాక్షన్ లేకుండా పోయింది అంటున్నారు. అదే సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణాలో చూస్తే విభజన తరువాత మూడు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో బహుముఖ పోటీలు జరిగాయి. అప్పట్లో తెలంగాణా వాదం బలమంగా వినిపించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జట్టుగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఒక వైపు ఉంది. వైసీపీ కాంగ్రెస్ మరో వైపు ఉన్నాయి. కమ్యూనిస్టులు కూడా పోటీ పడ్డారు. ఫలితం ఎంతో ఉత్కంఠ రేకెత్తించింది.

ఇక 2018లో అయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఒక వింత ఆకర్షణగా నిలిచింది. ఆ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. బీజేపీ విడిగా పోటీ పడింది. టీఆర్ఎస్ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ ఎన్నికల్లో కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగాయి. అధికార టీఆర్ఎస్ రెండోసారి గెలుస్తుందా అన్న టెన్షన్ కూడా ఏర్పడింది. చివరికి టీఆర్ఎస్ గెలిచింది.

ఇక 2023లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక వైపు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మరో వైపు పోటీ పడ్డాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఆ ఎన్నికలు సాగి జనంలో హుషార్ ని తెచ్చాయి. చివరికి కాంగ్రెస్ గెలిచింది. కానీ ఏపీలో చూస్తే తొలి రెండు ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం అయితే ఈసారి కనిపించడంలేదు అంటున్నారు.

దానికి కారణం రెండే పార్టీలు రెండే సామాజిక వర్గాలు ఇద్దరు నాయకులు రెండు కుటుంబాల మధ్యనే పోటీ అన్నట్లుగా ఏపీ రాజకీయం సాగుతోంది. దాంతోనే ఈసారి ఎన్నికల పట్ల జనాలకు పెద్దగా ఆసక్తి లేదు అంటున్నారు. అందుకే ఊపు కానరావడం లేదు అని అంటున్నారు

అయితే ఇలా ఉదాశీనంగా ప్రజానీకం ఉంటే అది రాజకీయ పార్టీలకు ఇబ్బంది అంటున్నారు. మరీ ముఖ్యంగా విపక్షానికి చేటు అంటున్నారు వేవ్ లేకపోతే విపక్షం వీక్ అవుతుంది అని అంటున్నారు.ప్రజలు భాగస్వామ్యం

కావాల్సి ఉంది. ఏపీలో చూస్తే ఇప్పటిదాకా ఆ పరిస్థ్తితి అయితే లేదు మరి ముందు ముందు కనిపిస్తుందా లేక ఇలాగే చప్పగానే ఏపీ ఎన్నికలు ముగుస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News