ఫిర్యాదు చేసి కోర్టులో ప్లేట్ తిప్పేసిన వైనంపై ఏపీ హైకోర్టు సీరియస్

లంచం అడుగుతున్నారని ఏసీబీకి కంప్లైంట్ చేసిన వ్యక్తి.. చివరకు కోర్టుకు వచ్చిన తర్వాత మాత్రం ప్లేట్ తిప్పేసిన ఉదంతంపై తాజాగా ఏపీ హైకోర్టు సీరియస్ కావటమేకాదు.

Update: 2024-02-04 05:39 GMT

లంచం అడుగుతున్నారని ఏసీబీకి కంప్లైంట్ చేసిన వ్యక్తి.. చివరకు కోర్టుకు వచ్చిన తర్వాత మాత్రం ప్లేట్ తిప్పేసిన ఉదంతంపై తాజాగా ఏపీ హైకోర్టు సీరియస్ కావటమేకాదు.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన వైనం చోటు చేసుకుంది. ఫిర్యాదుకు భిన్నంగా కోర్టులో భిన్నమైన సాక్ష్యం చెప్పటాన్ని ఆక్షేపించింది. కంప్లైంట్ దారు హోస్టెల్ విట్నెస్ గా మారినప్పటికీ.. ఇతర సాక్ష్యాల్ని తీసుకొని లంచం అడిగిన అధికారికి శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టులో సాక్ష్యం మార్చిన ఫిర్యాదుదారు మీద చర్యలు తీసుకోవటానికి మూడు వారాల్లో అతనిపై విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు కంప్లైంట్ చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..

1997 నుంచి 2003 వరకు మచిలీపట్నం పురపాలక కార్యాలయంలో చంద్రశేఖర్ అనే శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పని చేశారు. బియ్యం వ్యాపారి అయిన మురళీధర్ షాపు మీద కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.5వేలు లంచం కోసం డిమాండ్ చేశాడు. దీంతో.. అధికారిపై ఏసీబీకి కంప్లైంట్ చేశాడు వ్యాపారి మురళీ. లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారి మీద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో మురళీధర్ ప్లేట్ మార్చేశాడు. తాను చేసిన కంప్లైంట్ లో పేర్కొన్న అంశాలు తప్పుగా పేర్కొన్నారు.

దీనిపై ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో అధికారిపై ఉన్న ఆరోపణలు.. ఇతర సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఇచ్చిన తీర్పులను సవరించింది. సెక్షన్ 7 కింద ఏడాది పాటు సాధారణ జైలు.. రూ.వెయ్యి జరిమానాతో పాటు సెక్షన్ 13 కింద ఏడాది సాధారణ జైలుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఇందులో సెక్షన్ 7కింద విధించిన శిక్షను తొలగించింది. దీంతో.. సెక్షన్ 13 కింద విధించిన శిక్షను యథాతధంగా అమలు చేయనున్నారు. ప్లేట్ తిప్పేసి తప్పుడు సాక్ష్యం చెప్పిన మురళీపై అప్పట్లోనే కంప్లైంట్ చేయాల్సి ఉందని ఏసీబీ లాయర్ తో పేర్కొంది. దీంతో.. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అతడిపై కేసు నమోదు చేయనున్నారు.


Tags:    

Similar News