ఏఐతో ప్రపంచం ఇంత ప్రమాదంలో ఉందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ దశాబ్ధపు సాంకేతిక సంచలనం అని ఒకరంటే.. సరికొత్త సాంకేతిక విప్లవం అని మరొకరు అంటారు.

Update: 2025-01-27 08:02 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ దశాబ్ధపు సాంకేతిక సంచలనం అని ఒకరంటే.. సరికొత్త సాంకేతిక విప్లవం అని మరొకరు అంటారు. ఇదొక అద్భుతం అని, మానవాళికి ఇందెంతో ప్రయోజనకరమని చెబుతుంటారు. ఇదే సమయంలో... దీనివల్ల వాటిల్లే ఉపద్రవాలపైనా విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఏఐ 'రెడ్ లైన్' దాటేసిందా అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగమా ఏఐ సెల్ఫ్ రిప్లికేషన్ (స్వీయ ప్రతిరూపణ) గణనీయమైన సామర్థ్యాన్ని సాధించిందని.. ఇది రెడ్ లైన్ ను దాటేసిందని.. ప్రీప్రింట్ డేటాబేస్ arXivలో ప్రచురించబడిన ఓ అధ్యయనం తెరపైకి తెచ్చింది. దీనిపై శాస్త్రీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతుందని అంటున్నారు.

ఇందులో భాగంగా... మెటా, అలీబాబా లకు చెందిన రెండు ప్రముఖ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం) మానవ ప్రమేయం లేకుండా తమను తాము క్లోన్ చేసుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. 90 శాతం ప్రయోగాత్మక ట్రయల్స్ లో వాటికవే ప్రత్యేక కాపీని సృష్టించడంలో విజయం సాధించాయని అంటున్నారు.

దీంతో... ఈ సెల్ఫ్ క్లోనింగ్ అనేది ఏఐ వ్యవస్థల నియంత్రణ, భద్రత గురించిన ఆందోళన పెంచుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మానవ పర్యవేక్షణకు మించి అభివృద్ధి చెందడం.. లేదా, మానవ ప్రయోజనాలకు ముప్పుగా మారడం అనేది ఇప్పుడు తీవ్ర ఆందోళనగా ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై కఠినమైన నియంత్రణ చర్యల అవసరాన్ని ఈ తాజా పరిణామం ఎత్తి చూపిస్తుందని అంటున్నారు. హార్డ్ వేర్ లోపాలను పరిష్కరించడానికి సిస్టం ను రీబూట్ చేస్తుందని చెబుతున్నారు. మానవ సహాయం లేకుండా విజయవంతమైన సెల్ఫ్ రిప్లికేషన్ అనేది ఏఐకి మనిషిని అధిగమించడానికి అవసరమైన దశ అని, ఇది ముందస్తు సంకేతమని చెబుతున్నారు.

Tags:    

Similar News