మూడు నెలల క్రితం తప్పిపోయింది పాములా ప్రత్యక్షమయ్యింది వీడియో!
ఇందులో భాగంగా... ఓ అమ్మాయి నాగిని అవతారంలోకి మారినట్లు కనిపిస్తుంది.
సుమారు మూడు నెలల క్రితం ఓ యువతి కనిపించకుండా పోయింది. అయితే.. ఆమె కోసం వెతికి వెతికి కుటుంబ సభ్యులు అలసిపోయారని అంటున్నారు! అయితే తాజాగా ఆమె ఓ గుహలో ప్రత్యక్షమైంది! అయితే ఇప్పుడు ఆమె మాములు యువతిలా ప్రవర్తించడంలేదు... పాములా పాకుతుంది, అప్పుడప్పుడూ నాలుక బయటపెడుతుంది, దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... ఉత్తరప్రదేశ్ లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ఓ అమ్మాయి నాగిని అవతారంలోకి మారినట్లు కనిపిస్తుంది. దీంతో... స్థానికులు ఆమెకు పూజలు చేయడం ప్రారంభించారు. ఇది దైవానుగ్రహం అని చెబుతున్నారు. దేవుని మహిమ వళ్లే ఈ యువతి పాముగా మారిందని చెబుతున్నారు. దీంతో... జనం తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు.
వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని కోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్తా ధామ్ గుహలో ఓ యువతి సర్ప రూపంలో కనిపించింది. దీంతో... ఇది ఆమెకు దక్కిన దైవానుగ్రహం అంటూ పూజలు చేసేస్తున్నారు జనం. అయితే... ఈ యువతి జార్ఖండ్ నివాసి అని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈమె వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో కింద కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
ఈ వీడియోలో... ఓ చీకటి గుహలో ఓ అమ్మాయి నేలపై పడి ఉంది. ఈ సమయంలో కొంతమంది ఆమెకు పూజలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తన నాలుకను పదే పదే బయటకూ, లోపలకూ అనుకుంటూ అచ్చం పాము మాదిరిగా ప్రవర్తిస్తూ కనిపిస్తోంది. నేలపై పాములా పాకుతోంది.. నాలుక చాపుతోంది.
దీంతో... ఈ విచిత్రమైన చేష్టలకు అక్కడున్న వారు కొంతమంది భయందోళనలకు గురయ్యారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఆమె వ్యవహారాన్ని వీడియోల్లో బందిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం పూజలు చేయడం ప్రారంభించారు. పైగా ఈ యువతి ఉన్న గుహకు సమీపంలో ఓ శివాలయం కూడా ఉంది.
దీంతో... గుహలో పాములా ఉన్న ఆ యువతిని అక్కడకు తీసుకెళ్లి పూజలు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది! ఇక ఈ విచిత్ర సన్నివేశాన్ని చూడటానికి జనం తండోప తండాలుగా వస్తున్నారని అంటున్నారు!
ఇదిలా ఉంటే... జార్ఖండ్ లోని కరివాడి ఖరోంధీ ప్రాంతానికి చెందిన ఓ యువతి సుమారు మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిందని చెబుతున్నారు. ఆమెకోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదట. అయితే... ఇలా అకస్మాత్తుగా పాములా ప్రవర్తించడం చూసి ఆశర్యపోతున్నారని అంటున్నారు.