తెలంగాణా రిజల్ట్స్ వచ్చేవరకూ ఏపీలో వైసీపీ కన్ ఫర్మ్ చేయదంట... లాజిక్ ఇదే....?

ఏపీలో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసేదానికీ తెలంగాణా ఎన్నికల ఫలితాలకు మధ్య లింక్ ఉందా అంటే ఉందనే ప్రచారం సాగుతోంది

Update: 2023-10-13 12:30 GMT

ఏపీలో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసేదానికీ తెలంగాణా ఎన్నికల ఫలితాలకు మధ్య లింక్ ఉందా అంటే ఉందనే ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం వరకూ రెండూ ఉమ్మడి ఏపీలోనే ఉన్నాయి. అక్కడా ఇక్కడా దాదాపుగా రాజకీయం సెంటిమెంట్లు అన్నీ కూడా ఒక్కలాగానే ఉంటాయని అంటున్నారు. దాంతో ఏపీలో అధికార పార్టీ వైసీపీ తెలంగాణా ఎన్నికల ఫలితాల కోసం ఇప్పటి నుంచే వేచి చూస్తోంది అని అంటున్నారు.

ఎందుకు అంటే తెలంగాణాలోని ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. అయినా సరే అక్కడి ముఖ్యమంత్రి కేసీయార్ వాళ్ళకే టికెట్లను కన్ ఫర్మ్ చేసి బరిలో నిలబెట్టారు. ఇదంతా సీఎం కేసీయార్ తన మీద నమ్మకంతో ప్రజలకు తన పట్ల ఉన్న విశ్వాసంతో ఇదంతా చేశారని అంటున్నారు.

జనాలు కేసీయార్ ని చూసి ఓటేస్తారు తప్ప ఎమ్మెల్యేలను కాదన్న ఆలోచనతోనే ఆయన సిట్టింగులకే టికెట్లు ఇచ్చారని అంటున్నారు. అంతే కాదు తన పరిపాలనను జనాలు చూస్తారని భావిస్తున్నారు. కేసీయార్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పధకాలను చూసి జనాలు ఓటు వేస్తారు అని అంటున్నారు. దాంతో ఎమ్మెల్యేల నెగిటివిటీ అన్న దాన్ని పెద్దగా పట్టించుకోకుండా టికెట్లు ఇచ్చారు అని అంటున్నారు.

ఇక కేసీయార్ బొమ్మను చూసే ఓట్లు జనాలు వేస్తారు అని నమ్మకం బీయారెస్ కి ఉంది అంటున్నారు. దీన్ని ఏపీలోని అధికార పార్టీ వైసీపీ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఒక వేళ కేసీయార్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయి అక్కడ అభ్యర్ధులు అంతా గెలిచి మళ్ళీ బీయారెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఏపీలో వైసీపీ తన సిట్టింగుల విషయంలో పెద్దగా మార్పు చేయదని అంటున్నారు.

ఎందుకంటే ఏపీలో కూడా వైసీపీకి చెందిన సిట్టింగ్ అభ్యర్ధుల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. అలా వ్యతిరేకత ఉన్న వాళ్ళను మార్చాలని ఇప్పటిదాకా అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అయితే తెలంగాణా ఎన్నికలను చూసిన మీదటనే డెసిషన్ తీసుకోవాలని ఇపుడు భావిస్తున్నారుట.

ఏపీలో కూడా జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను అమలు చేశారు. జగన్ బొమ్మను చూసి ఆయన పాలనను చూసి ఆయన ఇస్తున్న పధకాలను చూసి జనం ఓటేస్తారు అన్న నమ్మకం వైసీపీ నేతలలో ఉంది. అందుకే ప్రస్తుతం వైసీపీ అధినాయకత్వం తెలంగాణా వైపు చూస్తోంది. బీయారెస్ మూడవసారి గెలిచి అధికారంలోకి వస్తే కనుక జనాలు ఎమ్మెల్యేలను వారి పట్ల వచ్చే వ్యతిరేకతను పట్టించుకోకుండా ముఖ్యమంత్రులను చూసే ఓటు వేస్తున్నారు అని అర్ధం అవుతుంది.

అలాగే పాలన బాగుంటే పధకాలు జనాలు కోరుకుంటే ఎమ్మెల్యేలు ఎవరు అయినా ముఖ్యమంత్రి కోసమే ఓటేస్తారు కాబట్టి అలా జనాలు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రులకే అని అర్ధం అవుతుంది. బీయారెస్ గెలిస్తే కనుక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి మార్పు చేయకుండానే దాదాపుగా అందరికీ టికెట్లు ఇస్తూ ముందుకు పోతుంది అని అంటున్నారు. ఒకవెళ బీయరెస్ కనుక ఓటమి పాలు అయితే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతను జనాలు గట్టిగానే పట్టించుకుంటున్నారు అని అర్ధం చేసుకుంటుంది వైసీపీ అంటున్నారు.

అపుడు మాత్రం వైసీపీ సిట్టింగ్ అభ్యర్ధులలో భారీగానే మార్పుచేర్పులు ఉంటాయని అంటున్నారు. అవి మామూలుగా ఉండవని ఏకంగా వంద నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చేస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇంత పెద్ద సంఖ్యలో వైసీపీ సిట్టింగులకు మార్చడానికి తెలంగాణా ఎన్నికలను అధినాయకత్వం కొలమానంగా చూసుకుంటుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ సిట్టింగుల భవిష్యత్తు అంతా తెలంగాణా ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News