జగన్ ఆరోపణలపై బాలయ్య ఫస్ట్ & స్ట్రాంగ్ రియాక్షన్!

షర్మిలపై తప్పుడు ఆరోపణలు, జగన్ చేసిన విమర్శలపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.

Update: 2024-11-22 10:10 GMT

కుటుంబ బాంధవ్యాలు, మానవతా విలువ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని.. ఆయన రాజకీయాల్లో ఎదిగిన తీరును చూస్తే ఎవరికైనా ఇది స్పష్టంగా అర్ధమవుతుందని.. షర్మిల మీద చంద్రబాబు దుష్ప్రచారం చేయించారంటూ జగన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... గతంలో హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో గల బాలకృష్ణ సొంత టవర్ ఎన్.బీ.కే బిల్డింగ్ నుంచి వెబ్ సైట్లలో తప్పుడు రాతలు రాయించాలేదా.. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలలేదా అంటూ జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. నాడు షర్మిల ఈ విషయంపై స్పందించిన వీడియో క్లిప్పింగును ప్రదర్శించారు.

దీంతో... ఈ విషయం మరోసారి సంచలనంగా మారింది. జగన్ తన ప్రెస్ మీట్ లో ప్రదర్శించిన వీడియోలో.. తనపై బాలకృష్ణ ఆఫీసు నుంచి దుష్ప్రచారం జరిగిందంటూ షర్మిల స్పష్టం చేయడం ఆ వీడియోలో కనిపించింది! దీంతో.. ఈ విషయంపై మొదటిసారిగా నందమూరి బాలకృష్ణ స్పందించారు.

షర్మిలపై తప్పుడు ఆరోపణలు, జగన్ చేసిన విమర్శలపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఇందులో భాగంగా.. నాడు తప్పుడు ప్రచారాన్ని చేసిందేవరో.. చేయించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని.. వ్యాఖ్యానించారు. ఈ అసత్య ప్రచారాన్ని వాళ్లే పట్టించుకోనప్పుడు తానెందుకు పట్టించుకోవాలని అన్నారు.

ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించడ్డాని తప్పుపట్టిన బాలయ్య.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిలో వాళ్ల మనుషులను పెట్టారని.. వాళ్లను గెలిపించుకోవడానికైనా ఒక్కరోజైనా అసెంబ్లీకి వస్తారు పాపం అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ కూడా రాకుండా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

కాగా ఇదే విషయంపై ఈ రోజు స్పందించిన షర్మిల... నిజంగానే జగన్ కు చెల్లెలిపై ప్రేమ ఉంటే.. బాలకృష్ణ నివాసంలోని సిస్టం ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే.. ఐదేళ్లు సీఎంగా ఉండి ఏమి గాడిదలు కాశారని? బాలకృష్ణపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News