బాలయ్యా మజాకానా !

హిందూపురంలో వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను లాగేసి సిసలు పొలిటీషియన్ అయ్యారు. టీడీపీకి ఇక ఎప్పటికీ తిరుగులేదనిపించారు. మొత్తానికి బాలయ్య సినీ రంగంలో తన మార్క్ ని చాటుకుంటున్నారు.

Update: 2024-08-18 04:07 GMT

నందమూరి అందగాడు బాలయ్య అంటే అదే మరి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆబాలగోపాలంతో సందడి చేస్తారు. జోష్ తీసుకుని వస్తారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోతారు. అందరి కష్టం వింటారు. ఇష్టంగా అందరితో మసలుతారు.

అందుకే హిందూపురానికి బాలయ్య బంధువు అయ్యారు. హిందూపురం గడ్డ నందమూరి గడ్డ అని అన్నారంటే దటీజ్ బాలయ్య అని చెప్పాల్సిందే. జై కొట్టాల్సిందే. హిందూపురంలో 1983 నుంచి టీడీపీ గెలుస్తూనే ఉంది. ఇక అన్న నందమూరి తారకరామారావు అయితే తన రాజకీయ జీవితంలో చివరి వరకూ ఉంచుకున్న సీటు అదే.

ఆయన 1985, 1989, 1994లో గెలిచారు. ఆయన 1996లో మరణించారు. అంటే ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా మాత్రం పదకొండేళ్ళు మాత్రమే పనిచేశారు. ఇక ఆయన కుమారుడు హరికృష్ణ హిందూపురం ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్ళు పనిచేశారు.

బాలయ్య అయితే 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆయన మరో ఏడాది దాటితే తండ్రి ఎన్టీఆర్ పదకొండేళ్ల ఎమ్మెల్యే రికార్డుని అధిగమించి కొత్త రికార్డుని క్రియేట్ చేస్తారు. ఈ పదిహేనేళ్లూ ఆయన ఎమ్మెల్యేగా ఉంటే అది మరో రికార్డు అవుతుంది. బాలయ్య కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారు ఎవరూ ఇప్పటికి అయితే ఉండరు.

ఇక హిందూపురానికి బాలయ్య అతిధిగా వస్తారు అని విపక్షాలు విమర్శలు చేయవచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడల్లా వెంట సంక్రాంతినే తెస్తారు. ఆయన ఉన్నన్ని రోజులూ ప్రజలకు పండుగ. సమస్యలను ఆయన శ్రద్ధగా ఆలకించి ఎక్కడికి అక్కడ పరిష్కరిస్తారు.

ఇక ఆయన హడావుడిని ఉత్సాహాన్ని చూస్తే ప్రజలు అంతా జై బాలయ్య అనాల్సిందే. తాజా పర్యటనలో బాలయ్య అన్న క్యాంటీన్లను ఓపెన్ చేశారు. అక్కడే ప్రజలతో పాటే ఆహారం తీసుకున్నారు. ఆ వెంటనే ఆర్టీసీ బస్సెక్కి డ్రైవర్ గా మారిపోయారు. చలో అంటూ హిందూపురం వీధుల్లో ఆర్టీసీ బస్సుని పరుగులు పెట్టించారు.

ఇలా పబ్లిక్ లో బస్సు నడిపి శభాష్ బాలయ్య రియల్ హీరో అంటే నీవే అనిపించుకున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని జనాలకు మాట ఇచ్చారు. అభివృద్ధిని బాటలు వేసేలా నిధులను కూడా తెస్తామని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే 160 కోట్ల నిధులు ఇచ్చారని కూడా చెప్పారు.

హిందూపురంలో వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులను లాగేసి సిసలు పొలిటీషియన్ అయ్యారు. టీడీపీకి ఇక ఎప్పటికీ తిరుగులేదనిపించారు. మొత్తానికి బాలయ్య సినీ రంగంలో తన మార్క్ ని చాటుకుంటున్నారు. అలాగే రాజకీయలలో తనకు సాటి లేరని చాటి చెబుతున్నారు. ఆయన మంత్రి కాకపోతేనేమి అంతకు మించిన ఖ్యాతి ఆయనకు ఉంది. ఆయన రోజూ నియోజకవర్గంలో తిరగలేకపోతేనేమి.ఆయన ఎపుడు వచ్చినా జేజేలు పలికే జనం ఉన్నారు. బాలయ్య సైతం తాను జనం మనిషిని అని పదే పదే రొజువు చేసుకున్నాక ఇక ఆయనకు ఎదురేముంది. సో నందమూరి బాలయ్యకు హిందూపురం బంధం ఎప్పటికీ తీరనిది. వీడనిది అని అంటున్నారు.

Tags:    

Similar News