ఇంటికి వెళ్తున్నా.. ఇక‌, వ‌స్తానో రానో.. : బ‌ర్రెల‌క్క ఎమోష‌న్‌

స‌రే ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. బ‌ర్రెల‌క్క కొంత సెన్సిటివ్ కావ‌డంతో ఎమోష‌న‌ల్ అయింది

Update: 2023-12-17 05:53 GMT
ఇంటికి వెళ్తున్నా.. ఇక‌, వ‌స్తానో రానో.. :  బ‌ర్రెల‌క్క ఎమోష‌న్‌
  • whatsapp icon

బ‌ర్రెల‌క్క‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మైన యూట్యూబ‌ర్ శిరీష.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల్లాపూర్ నియోజ‌క వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాడేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చా న‌న్న ఆమెకు అన్ని వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు కూడా ల‌భించింది. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ స‌హా ప‌లువురు ప్ర‌జాస్వామ్య వాదులు కూడా ఆమెకు అండ‌గా ఉన్నారు. అయితే.. ఆమె ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. కేవ‌లం 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి.

స‌రే ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. బ‌ర్రెల‌క్క కొంత సెన్సిటివ్ కావ‌డంతో ఎమోష‌న‌ల్ అయింది. ఇక‌, తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చేసి పోస్ట్ చేసింది. తాను ఎన్నికల్లో నిలబడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే అని.. అంతకుముందు వరకు తాను హాస్టల్‌లోనే ఉన్నానని.. కానీ ఇప్పుడు హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. తాను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే ఉన్నానని.. కాంపిటేషన్ పరీక్షలకు ప్రిపేర్ అయిన సమయంలో కూడా హాస్టల్‌లోనే ఉన్నట్లు ఆమె పేర్కొంది.

కానీ ఇప్పుడు ఎన్నికల లెక్కలు చేసుకోవాల్సి ఉండటంతోనే ఇంటికి వెళ్తున్నానని బర్రెలక్క వెల్లడించింది. ఇలా హాస్టల్ ఖాళీ చేయడం తనకు చాలా బాధగా ఉందని.. మళ్లీ వస్తానో రానో తెలియదని భావోద్వేగానికి గురైంది. 2021 నుంచి ఇప్పటివరకు తాను ఒకే హాస్టల్‌లోనే ఉన్నానని, హాస్టల్‌లో తనకు ఇంట్లోనే ఉన్న వాతావరణం ఉంటుందని.. ఫుడ్ కూడా చాలా బాగుంటుందని తెలిపింది. ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపిన వాళ్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలావుంటే, వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ తాను పోటీ చేస్తాన‌ని బ‌ర్రెల‌క్క ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News