అయిలయ్య ఆశలు రేవంత్ తీరుస్తాడా ?!
‘‘మా సామాజిక వర్గం బలగం రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు ఉంటుంది.
‘‘మా సామాజిక వర్గం బలగం రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వంలో గొల్ల, కురుమలకు గొర్రెలు ఇస్తేనే ఓడగొట్టినం. గొల్ల, కురుమల ప్రాతినిధ్యం లేకుండా రాష్ట్రంలో ఎప్పుడూ మంత్రి వర్గం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చింది. కానీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ముగ్గురికి అవకాశం దక్కింది. ఈ సారి నాకు మంత్రి పదవి ఇవ్వాలి. సీఎం రేవంత్ మీద నమ్మకం ఉంది’’ అంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన మనసులోని మాటను బయటపెట్టాడు.
అంతే కాకుండా తమ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ, ఒక సలహాదారు, ఐదు కార్పోరేషన్ చైర్మన్ పదవులు, పీసీసీ అధ్యక్ష్య పదవి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో రెండు పీర్వో పోస్టులను కూడా ఇవ్వాలని అయిలయ్య కోరడం విశేషం. దీంతో పాటు మరో లాజిక్ ను కూడా అయిలయ్య తెరమీదకు తెచ్చాడు.
నల్లగొండ పార్లమెంటు పరిధిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నాకు అవకాశం ఇవ్వాలని అయిలయ్య కోరడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుండి అయిలయ్య తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అయితే తనకు మంత్రి పదవితో పాటు తన సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పదవుల చిట్టాను చదివి వినిపించడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్న ఆరు మంత్రి పదవులలో నాలుగు భర్తీ చేస్తామని వాటిని కూడా వాయిదా వేసిన నేపథ్యంలో అయిలయ్యకు అవకాశం దక్కుతుందా ? లేదా ? అన్నది వేచిచూడాలి.