భార్యను చంపి సూట్ కేసులో పెట్టాడు... నెక్స్ట్ ట్విస్ట్ ఏమిటంటే..?

అవును... బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి పూణేకు పారిపోయాడు.;

Update: 2025-03-28 21:30 GMT
భార్యను చంపి సూట్  కేసులో పెట్టాడు... నెక్స్ట్  ట్విస్ట్  ఏమిటంటే..?

ఇటీవల ప్రియుడితో కలిసి భర్తను చంపి ఒక మహిళ డ్రమ్ములో వేస్తే... మరో ఘటనలో భర్తను చంపి, గోనె సంచెలో చుట్టి, ప్రియుడితో బైక్ పై వెళ్తూ సీసీ కెమెరాకు చెక్కిన మరో మహిళ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారగా... తాజాగా భార్యను చంపి, మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టిన భర్త వ్యవహారం బెంగళూరులో తెరపైకి వచ్చింది.

అవును... బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి పూణేకు పారిపోయాడు. అయితే.. అనంతరం ఏమైందో తెలియదు కానీ, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్ గా గుర్తించగా.. నిందితుడిని రాకేష్ రాజేంద్ర ఖేడేకర్ అని చెబుతున్నారు.

వీరిరువురూ మహారాష్ట్రకు చెందినవారే అయినప్పటికీ గత ఏడాది కాలంగా బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలో... బుధవారం రాత్రి ఇద్దరు భోజనం చేస్తున్న సమయంలో.. ఇద్దరి మధ్యా గొడవ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తన భర్తపైకి గౌరీ కత్తి విసిరి గాయపరిచగా.. అదే కత్తితో రాకేష్ ఆమెపై బలంగా దాడి చేశాడని.. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని కథనాలొస్తున్నాయి.

అనంతరం గురువారం వారి నివాసంలో గౌరి మృతదేహం ఒక సూట్ కేసులో ప్యాక్ చేయబడి కనిపించడంతో ఈ దారుణ నేరం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం... రాకేష్ బాధితురాలి మెడ, కడుపులో పలుమార్పు కత్తితో పొడిచి.. అనంతరం ఆమె శరీరాన్ని ఎనిమిది నుంచి పది ముక్కలుగా చేసి, సూట్ కేసులో కుక్కాడని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా... సూట్ కేసులో మృతదేహాన్ని కనుగొన్న తర్వాత ఆ ఇంటి యజమాని పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశారని.. ఆ మహిళ మాస్ మీడియాలో బ్యాచిలర్స్ పూర్తి చేయగా.. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తూ, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ లోనే ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ స్పందిస్తూ.. నేరం చేసిన అనంతరం గౌరీ తల్లి తండ్రులకు ఫోన్ చేసిన రాకేష్.. తాను చేసిన పనిని ఒప్పుకున్నాడని.. దీంతో కంగారుపడిన తల్లితండ్రులు వెంటనే మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు.. వారు కర్ణాటకలోని తమ పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.

ఇదే క్రమంలో... ఈ హత్యకు వివాహ సంబంధమైన విబేధాలే ప్రధాన కారణంగా కనిపిస్తోందని దయానంద్ వెల్లడించారు! ఈ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన రాకేష్.. పూణెలోని ఓ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపారు.

Tags:    

Similar News