ప్రశాంత్ కిశోర్ కి బిగ్ షాక్... జైలుకు తరలించనున్న పోలీసులు!
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కు కోర్టు షాకిచ్చింది! ఇందులో భాగంగా... 14 రోజుల రిమాండ్ విధించింది.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (బీ.పీ.ఎస్.సీ) వ్యవహారంలో జన్ సురాజ్ పార్టీ (జే.ఎస్.పీ) వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ కు కోర్టు షాకిచ్చింది! ఇందులో భాగంగా... 14 రోజుల రిమాండ్ విధించింది.
అవును.. బీ.పీ.ఎస్.సీ. వ్యవహారంపై పాట్నాలోని గాంధీ మైదాన్ లో గత నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిశోర్ ను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్పత్రికి తరలించారు! చట్ట విరుద్ధంగా నిరసన చేపట్టినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... గాంధీ మైదాన్ లోని నిరసనగా గుమిగూడిన అభ్యర్థులను పోలీసులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు. అనంతరం.. ప్రశాంత్ కిశోర్ ను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పాట్నా సివిల్ కోర్టు.. ప్రశాంత్ కిశోర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎయిమ్స్ లో వైద్య పరీక్ష అనంతరం పీకేని జైలుకు తరలించనున్నారు పోలీసులు.
కాగా... బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ పరీక్షలను రద్దు చేయాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.