నాగబాబు మినిస్టర్ పదవి ఖాయమేనా ?

ఇక నాగబాబు పెద్దల సభలో సభ్యుడుగా నియమితులాయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా కొత్త బాధ్యతలతో ఉన్నారు. ఆయన దూకుడుతో కూడిన రాజకీయాన్ని స్టార్ట్ చేశారు.;

Update: 2025-03-16 02:45 GMT

ఎమ్మెల్సీగా నెగ్గిన తరువాత నాగబాబు తొలి స్పీచ్ జనసేన ఆవిర్భావ సభలో ఇచ్చారు. ఆ స్పీచ్ అయితే టీడీపీ శ్రేణులను మంటెక్కించేలా ఉంది. మరీ ముఖ్యంగా పిఠాపురంలో టీడీపీ శ్రేణులు అయితే రగిలిపోతున్నాయి. మీ ఖర్మ అని ఆయన అనడం పట్ల వర్మ అనుచరులలో చర్చ సాగుతోంది.

అదే టైంలో పవన్ ఫ్యాక్టర్ అంటూ నాగబాబు పొలిటికల్ గా విశ్లేషించిన తీరు పట్ల కూడా పసుపు పార్టీలో హాట్ డిస్కషన్ సాగుతోంది. ఇక నాగబాబు పెద్దల సభలో సభ్యుడుగా నియమితులాయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా కొత్త బాధ్యతలతో ఉన్నారు. ఆయన దూకుడుతో కూడిన రాజకీయాన్ని స్టార్ట్ చేశారు.

మరి నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ ఉంది. ఆయనను మంత్రిగా చేస్తామని కొద్ది నెలల క్రితమే చంద్రబాబు ప్రకటించారు. ఇపుడు చూస్తే నాగబాబు ఈ నెల 30 నుంచి శాసనమండలిలో సభ్యుడుగా ఉంటారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అడ్డు అయితే లేదు. రాజ్యాంగ రిత్యా కూడా అది కుదురుతుంది.

మరి రాజకీయంగా రిత్యా చూస్తే అది ఇపుడు జరుగుతుందా లేక ఎపుడు జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి ఈ ఉగాదికి నాగబాబు ఒక్కరే కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. నాగబాబు ఒక్కరికే చాన్స్ ఇస్తే జనసేన మరింత హైలెట్ అవుతుందన్న వాదన అయితే ఇపుడిపుడే మొదలవుతోంది.

జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు నాగబాబు కామెంట్స్ పట్ల టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయన్న ప్రచారం ఒక వైపు ఉంది. మరో వైపు చూస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణను మంత్రి పదవి ఇవ్వకుండా నాగబాబుకు ఇస్తారా అని సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా అది ఇపుడేనా అన్న కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా అది రీ షఫలింగ్ లో ఇవ్వవచ్చు అని మరో మాటగా ఉంది. ఈ ఏడాది జూన్ 12తో కూటమి ప్రభుత్వానికి తొలి ఏడాది పూర్తి అవుతుంది.

దాంతో కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరు మీద సీరియస్ గానే మధింపు చేస్తారని అపుడు కొందరు ఇన్ కొందరు అవుట్ అవుతారని అంటున్నారు. ఆ నేపధ్యంలోనే కొత్త వారిని తీసుకుంటూ వారితో పాటే నాగబాబుని చేర్చుకుంటే ప్రత్యేకంగా ఆయన కోసం మంత్రి పదవి ఇచ్చినట్లుగా ఉండదని అంటున్నారు.

ఇక ఇపుడు అయితే వాతావరణం వేడిగా ఉంది. టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు. దాంతో ఈ నేపధ్యంలో కనుక మంత్రి పదవి నాగబాబుకు ఇస్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయో అన్నది కూడా చర్చగా ఉంది. సో నాగబాబుకు ఉగాది వేళ మంత్రి పదవి ప్రమాణం ఉంటుందా లేదా అన్నది సరికొత్త చర్చగా ముందుకు వస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    

Similar News