బిల్‌గేట్స్ భారత్ ప్రయోగశాల కామెంట్స్‌పై విమర్శలు
ఇండియాలో బిల్‌గేట్స్ ఎన్నో వేల కోట్ల చారిటీ పనులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియన్స్ ఎంతో గౌరవంగా బిల్‌గేట్స్ పట్ల వ్యవహరిస్తూ ఉండేవారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంలో భారత్‌ను ఒక ప్రయోగశాలగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను పలువురు ఇండియన్స్ సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇండియాలో బిల్‌గేట్స్ ఎన్నో వేల కోట్ల చారిటీ పనులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియన్స్ ఎంతో గౌరవంగా బిల్‌గేట్స్ పట్ల వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం సీన్ మారిపోయింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ, ఇండియన్స్ అంటే ఆయనకు చిన్నచూపు అంటూ సోషల్ మీడియా ద్వారా నేరుగా ఆయన్నే ట్యాగ్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్న వారు చాలా మంది ఉన్నారు.
ఆ పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. కొత్త విషయాలను పరిశీలించడానికి భారత్ ఓ ప్రయోగశాల అన్నారు. విద్యా రంగంలో గత 20 ఏళ్లలో భారత్ ఎంతో పురోగతి సాధించింది. తమ మైక్రోసాఫ్ట్‌కి అమెరికాలో కాకుండా అతిపెద్ద కార్యాలయం భారతంలో ఉంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి భారత్ బయట పడుతూ వచ్చింది. ఎన్నో రకంగాల్లో మార్పులు చూస్తూ వచ్చింది. ప్రతి విషయంలోనూ కొత్తదనంతో భారత్ ముందడుగు వేస్తుంది అనే ఉద్దేశ్యంతో బిల్‌గేట్స్ మాట్లాడుతూ భారత్‌ను ప్రయోగశాల అంటూ అభివర్ణించారు. అయితే ఆ సమయంలో ఆయన వినియోగించిన పదాలు వివాదాస్పదం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలకు పలువురు పలు రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన్ను విమర్శిస్తూ చేస్తున్న కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. భారత ప్రభుత్వంను మోసం చేస్తూ, ఇక్కడి వారికి ఏదో సేవ చేస్తున్నట్లు నమ్మిస్తూ ఆయన సొంత ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక్కడి ప్రజలను ఏమార్చుతున్నారంటూ ఒక నెటిజన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజలను ల్యాబ్స్‌లోని శాంపిల్స్‌గా పోల్చడం ఆయన అహంకారానికి ప్రతీకగా కొందరు విమర్శలు చేశారు. ఇండియన్స్ వల్ల లాభం ఉంది కనుకే అమెరికా వంటి పెద్ద దేశాల్లో ప్రముఖ కంపెనీలు పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి అని కొందరు అంటున్నారు.
మొత్తానికి బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యల అసలు ఉద్దేశ్యం ఏంటో కానీ చాలా మంది చాలా రకాలుగా ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ఇండియాను ప్రయోగశాల అన్నందుకు, ఇండియన్స్‌ను ప్రయోగ శాంపిల్స్ అన్నందుకు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు ఆయన దృష్టికి వెళ్లి ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి. ఇండియాలో పర్యటిస్తున్న బిల్‌గేట్స్ ఢిల్లీ ఐఐటీలో పర్యటించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించనున్నారు. ఆయన ఈసారి ట్రిప్ పూర్తిగా వివాదాస్పదం కావడం పట్ల మైక్రోసాఫ్ట్ టెక్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.