అంతటి బిల్ గేట్స్ కు కూడా క్లారిటీ ఉండేది కాదా?

జీవితాన్ని అస్వాదించకుండా ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. జీవితాన్ని అస్వాదించటం కూడా మర్చిపోయేలా కష్టపడొద్దని.. పని కంటే జీవితం ఎంతో గొప్పదన్నారు.

Update: 2023-12-25 10:00 GMT

చూసేందుకు చిన్న విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ.. అలాంటి వాటిల్లో తల పండిన మేధావులు సైతం తప్పులు చేస్తుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ వెల్లడించారు. వీక్లీఆఫ్ ల విషయంలో తన ఆలోచనల్లో వచ్చిన మార్పును పంచుకున్నారు. తన బ్లాగ్ లో తాజాగా రాసిన అంశాలు ఆసక్తికరంగానే కాదు.. కొందరు తమ తీరును మార్చుకోవాల్సిన విషయాల్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

వీక్లీ ఆఫ్ లు తీసుకొని.. పని చేయకుండా ఖాళీగా ఉండటం తనకు నచ్చేది కాదని పేర్కొన్నారు. కంపెనీని ప్రారంభించిన మొదట్లో సెలవులు తీసుకోవటాన్ని.. వారాంతాల్లో పని చేయకపోవటం తనకు నచ్చేది కాదన్న ఆయన.. తాను తండ్రిని అయ్యాక కానీ తన అభిప్రాయంలో మార్పులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. పని కంటే జీవితం ఎంతో గొప్పది.. విలువైనదన్న విషయం తనకు అర్థమైందని పేర్కొన్నారు.

ఈ ఏడాది మొదట్లో అరిజోనా వర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బిల్ గేట్స్ పాల్గొనటం.. ఆ సందర్భంగా అక్కడి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలకమైన వ్యాఖ్యలు వచ్చాయి. జీవితాన్ని అస్వాదించకుండా ఉండటాన్ని ఆయన తప్పు పట్టారు. జీవితాన్ని అస్వాదించటం కూడా మర్చిపోయేలా కష్టపడొద్దని.. పని కంటే జీవితం ఎంతో గొప్పదన్నారు.

తానీ విషయాన్ని తెలుసుకోవటానికి చాలా టైం పట్టిందన్న ఆయన.. "మీరు అంతసేపు వెయిట్ చేయొద్దు. మీ బంధాల్ని బలపర్చుకోవటానికి.. విజయాన్ని షేర్ చేసుకోవటానికి.. నష్టాల నుంచి బయటకు రావటానికి కొంత టైంను వెచ్చించండి.పని కంటే జీవితం గొప్పది. ఎంతో విలువైనది" అని ఆయన పేర్కొన్నారు.

తాజాగా రాసిన బ్లాగ్ లో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తనకు సెలవుల మీద ఆసక్తి ఉండేది కాదన్న ఆయన.. వారు పెరుగుతున్నకొద్దీ తనకెంతో ఆనందాన్ని కలిగించేదన్నారు. గోల్ కీపర్స్ ఈవెంట్ లో తన చిన్న కుమార్తెతో కలిసి వేదికను పంచుకోవటం చాలా హ్యాపీగా ఉండేదన్నారు. జీవితంలో కెరీర్ ముఖ్యమే కానీ.. కెరీరే జీవితం కాదన్న సూత్రాన్ని ఇప్పటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

Tags:    

Similar News