వీడియో : యూపీలో 'బుల్డోజర్ వెడ్డింగ్'.. అదిరిపోలా..?

ఎవ్వరూ ఊహించని రీతిలో సాగిన ఈ బుల్డోజర్ కాన్వాయ్ పెళ్లి ఊరేగింపు ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2025-02-22 11:30 GMT

ఎవరైనా పెళ్లంటే ఏం చేస్తారు.. సాధారణంగా కార్లు, బైక్ లు , లేదంటే గుర్రాల బక్కీలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. కానీ జరిగేది యూపీలో.. అదీ యోగి పాలనలో కొందరు వినూత్నంగా ఆలోచించారు. యోగి బుల్డోజర్ మేనియాను వాడుకొని ఏకంగా పెళ్లికొడుకుకు షాకిచ్చారు. ఆయన కారువెంట బుల్డోజర్లతో భారీ ర్యాలీ తీయించారు. ఎవ్వరూ ఊహించని రీతిలో సాగిన ఈ బుల్డోజర్ కాన్వాయ్ పెళ్లి ఊరేగింపు ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలేంటి పెళ్లి.. ఎందుకు ఇలా చేశారనే దానిపై స్పెషల్ స్టోరీ..

 

యూపీలో ‘బుల్డోజర్‌ వెడ్డింగ్‌’ వైరల్ గా మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో బుల్డోజర్‌ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. దీనిని పలు సందర్భాల్లో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఝాన్సీలో వధువు కుటుంబం పెళ్లి ఊరేగింపును మరింత ప్రత్యేకంగా మార్చింది. వధువు కరీష్మా కోసం వరుడు రాహుల్‌యాదవ్‌ కారులో వేచివుండగా, అతని మామ రామ్‌కుమార్‌ లగ్జరీ కార్ల స్థానంలో 12 బుల్డోజర్లతో కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.

 

ఈ వినూత్న ఆలోచన వెనుక కారణాన్ని వెల్లడించిన రామ్‌కుమార్‌ మాట్లాడుతూ, తమ కుమార్తె పెళ్లిని ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నామని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బుల్డోజర్‌ను వినియోగించామని చెప్పారు. ఈ పెళ్లి ఊరేగింపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ కొత్త ఐడియాను ఆసక్తిగా స్వీకరించి మెచ్చుకుంటున్నారు.

ఇటీవల, ‘బుల్డోజర్‌ న్యాయం’ పేరుతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే చర్యలను కొనసాగిస్తున్నాయి. యూపీలో ప్రారంభమైన ఈ విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. యోగి ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్‌ చర్యలు రాజకీయంగా కూడా హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార రథాలుగా జేసీబీలను వినియోగించిన సందర్భాలు కూడా చూశాం.

ఈ నేపథ్యంలో, ఝాన్సీలో జరిగిన ‘బుల్డోజర్‌ వెడ్డింగ్‌’ కొత్త చర్చకు తెరలేపింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News