రాజమండ్రి సెంట్రల్ జైలు ఏపీలో అతి పెద్ద జైలు. ఆ జైలులో ఎందరో ఖైదీలుగా ఉన్నారు. ఈ జైలు చరిత్రలో మొదటి సారి ఒక వీవీఐపీ వస్తున్నారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబునాయుడు. ఆయన ఎన్నో సార్లు రాజమండ్రి వచ్చారు. రీసెంట్ గా చూస్తే మూడు రోజుల పాటు ఆయన రాజమండ్రిలో జరిగిన మహానాడులో పాల్గొన్నారు.
కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో రాజమండ్రికి వస్తానని బాబు ఊహించి ఉండరు. అందునా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తాను ఒక రిమాండ్ ఖైదీగా వస్తానని కలలో కూడా అనుకోని ఉండరు. అలాంటి అనుభవం ఇపుడు ఆయన తొలిసారి అనుభవించనున్నారు.
విజయవాడ నుంచి చంద్రబాబుని పోలీసులు తరలించనున్నారు. పూర్తి పకడ్బందీ ఏర్పాట్లతో ఆయనను తరలించనున్నారు ఇక ఈ రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత చంద్రబాబుని రాజమండ్రి కోర్టుకు తరలించే కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు విజయవాడ రాజమండ్రీ దాకా రోడ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. బాబు కోసం ప్రత్యేక బ్యారెక్స్ ని కూడా సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు. మొత్తం హైవేతో విజయవాడ రాజమండ్రి రోడ్ ఉంది. విజయవాడ నుంచి రాజమండ్రి దాకా ఏకంగా 39 పికెటింగ్స్ ని పోలీసులు ఏర్పాటు చేశారు దారిపొడవునా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జైలు వద్ద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్న నేపధ్యంలో టియర్ గ్యాస్ వాహనాలను సైతం పోలీసులు సిద్ధం చేశారారు. ఇదిలా ఉంటే రోడ్డు మార్గంలోనే చంద్రబాబును తరలించనున్నారు.