సీమ డిక్లరేషన్ ఇక, సీరియస్సే.. చంద్రబాబు సంచలన నిర్ణయం
వచ్చే నెల 1 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన రాయలసీమ లోని జిల్లాల్లో పర్యటించనున్నారు.
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర లో 'రాయలసీమ డిక్లరేషన్'ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ డిక్లరేషన్ ను కొందరు బుట్టదాఖలు చేశార ని విమర్శించినా.. పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సీమ డిక్లరేషన్ ను సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. వరుసగా మూడు రోజుల నుంచి ఆయన సీమ లోని సాగునీటి ప్రాజెక్టుల ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సర్కారు పై విమర్శలు చేస్తున్నారు. ఇక, ఇవి కొనసాగుతున్నక్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్నయం తీసుకున్నారు.
వచ్చే నెల 1 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన రాయలసీమ లోని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నాలుగు రోజుల్లోనూ వివిధ ప్రాజెక్టుల ను సందర్శించి.. గత టీడీపీ సర్కారు ఏం చేసిందో.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా చంద్రబాబు వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నాలుగు రోజుల కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చేలా ఏర్పాట్లు కూడా పార్టీ తరఫున చేస్తుండడం గమనార్హం.
ఆగస్టు 1: రాయలసీమ లో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుంది
ఆగస్టు 2: రైతుల తో ముఖాముఖి.. సమస్యల పై చర్చ. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పురోగతి వివరాల పై వివరణ
ఆగస్టు 3: గండికోట రిజర్వాయర్ పరిశీలన. అనంతపురం జిల్లాలో పర్యటన
ఆగస్టు 4: కళ్యాణదుర్గం లో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్ లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారు.