విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో బిగ్ రిలీఫ్!

వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఓ షాకింగ్ విషయం చెప్పిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-31 10:50 GMT

వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఓ షాకింగ్ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వ్యవసాయం కూడా స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఆయనకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.

అవును... ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటిస్తూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో.. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా వెళ్లాలనో ఏమో కానీ.. విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్, నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే అందుకు కచ్చితంగా హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఈ మేరకు సీబీఐ అధికారుల అభిప్రాయం కూడా కోరినట్లు తెలుస్తోంది!

ఈ సమయంలో.. సీబీఐ నుంచి సానుకూల సమాధానం రావడంతోనో ఏమో కానీ.. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరకు నార్వే, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10లోపు ఈ 15 రోజులు ఉండాలని తెలిపింది. దీంతో.. సాయిరెడ్డి సిద్ధమవుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News