కన్యత్వాన్ని రూ.18 కోట్లకు అమ్ముకున్న యువతి!

లారా మాట్లాడుతూ "చాలామంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు. కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నాను" అని చెప్పింది.;

Update: 2025-03-12 20:30 GMT

ఎవరైనా డబ్బుల కిడ్నీలు అమ్ముకుంటారు.. బాడీలోని ఇంకేదో పార్ట్ నో.. రక్తాన్నో అమ్ముకుంటారు. కానీ ఈ బ్రిటీష్ సుందరి ఏకంగా తన కన్యత్వాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకొని వార్తల్లో నిలిచింది. ఆమె తన కన్యత్వాన్ని వేలం వేయడమే ఆలస్యం.. డబ్బున్న వారు.. ప్రముఖులు ఎగబడి మరీ వేలం పాట పాడి ఆమెను దక్కించుకోవడానికి కోట్లు కురిపించారు. వినడానికే వింతగా ఉన్నా.. ఇది నిజంగా జరిగిన వాస్తవం.. దీంతో ఈ వార్త ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది..

ఇంగ్లాండ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి లారా తన కన్యత్వాన్ని ఆన్లైన్‌లో వేలానికి పెట్టి సంచలనం సృష్టించింది. ఈ వేలంలో హాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ నటుడు భారీ మొత్తాన్ని చెల్లించి లారాను పొందాడు. మొత్తం రూ.18 కోట్లు ఈ ఒప్పందానికి ఖర్చు చేసినట్లు సమాచారం.

లారా మాట్లాడుతూ "చాలామంది అమ్మాయిలు తమ కన్యత్వాన్ని మోజులో పడి కోల్పోతారు. కానీ నేను దీని ద్వారా భవిష్యత్తుకు భద్రత కల్పించుకున్నాను" అని చెప్పింది.

ఈ వేలంలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, ఇతర శక్తివంతమైన వ్యక్తులు పాల్గొన్నారు. చివరికి హాలీవుడ్ నటుడు అత్యధిక ధరకు లారాను సంపాదించాడు. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తున్నారు.

ఇలాంటి వేలాలు సమాజానికి మంచి చేస్తున్నాయా? లేక పాతకాలపు విలువలను ధిక్కరిస్తున్నాయా? అనే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.

కానీ ఆధునిక బ్రిటన్ లాంటి దేశంలో ఇలా తమకు నచ్చినది చేసే స్వేచ్ఛ.. తాము అనుకున్నది అనుభవించేంత స్వాతంత్ర్యం ఉండడంతో అక్కడ ఎవ్వరూ దీన్ని తప్పుగా చూడరు.

Tags:    

Similar News