పవన్ మనసు విప్పుతారా ?

ఈ క్రమంలో పవన్ జనసేన ఆవిర్భావ సభలో ఏమి మాట్లాడుతారు అన్నది చర్చగా ఉంది. ఆయన మనసు విప్పి మాట్లాడుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.;

Update: 2025-03-12 18:30 GMT

జనసేన అధినేతగా పవన్ లో ఫైర్ వేరు. ఆయన స్పీచ్ ఇస్తే ఆ ఊపే వేరు. ఆయన ప్రతీ మాటలో ఒక ఆటం బాంబు ఉండేది. దానితోనే పవన్ స్పీచ్ లకు యమ క్రేజ్ ఏర్పడింది. అలాంటి పవన్ అధికారంలోకి వచ్చాక తన స్పీచ్ లో వాడి వేడి తగ్గించేశారు అన్న చర్చ సాగుతోంది. ఎందుకు ఆయన అలా చేస్తున్నారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది.

అయితే ప్రభుత్వంలో ఉన్న వారు తగ్గి మాట్లాడారని గతంలోలా విరుచుకుపడడం కుదరదని అన్న వారూ ఉన్నారు. అయితే పవన్ అంటేనే ఫైర్ బ్రాండ్ స్పీచ్ కి పెట్టింది పేరు. ఆయన నుంచి అంతా అవే ఆశిస్తారు. పవన్ విషయం తీసుకుంటే చాలా కాలంగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన దూకుడు కూడా మునుపటిలా లేదు.

ఇదిలా ఉంటే తొమ్మిది నెలల పాటు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కోరుకుంటున్నట్లుగా ప్రభుత్వం సాగుతోందా అన్నది ఒక చర్చ అయితే పవన్ తమ ప్రభుత్వం పనితీరు పట్ల ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారు అన్నది మరో చర్చగా ఉంది.

ఒక్కసారిగా ఏమైనా ఆకాశం నుంచి తీసుకుని వచ్చి ఇస్తారని ఎవరూ అనుకోరు. అదే సమయంలో ప్రజలకు చెప్పింది చేయాలి. వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అన్నది కూడా ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా సాగుతోందా అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.

సూపర్ సిక్స్ హామీలు పెద్దగా నెరవేరక పోవడం సమస్యలు గతంలో ఉన్నవి అలాగే సాగడంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చినా కొన్ని చోట్ల పాత విధానాలే అమలు అవుతున్నాయన్నది ఉంది. మరి పవన్ కళ్యాణ్ తాను కూటమి తరఫున ఇచ్చిన హామీలను నెరర్వేచే పనిలో సక్సెస్ అయ్యారా ఆ విషయంలో ఆయనలో ఎంత వరకూ సంతృప్తి ఉంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఒక విధంగా చూస్తే జనసేనలో ఏదో తెలియని అంతర్మధనం కలుగుతోందా అన్నది కూడా ఉంది. తాజాగా జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ అయితే ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా జనసేన వల్లనే కూటమి ఏర్పాటు అయిందని చెప్పారు. అంతే కాదు పవన్ కనుక తలచుకుని ఉండకపోతే అధికారం కూడా దక్కేది కాదని అన్నారు. చంద్రబాబు సీఎం కావడం వెనక పవన్ కృషి ఉందని అన్నారు.

పవన్ కి తలలో నాలికగా ఉండే నాదెండ్ల మనోహర్ ఈ విధంగా మాట్లాడారు అంటే కచ్చితంగా పవన్ కూడా ఆ విధంగా నా భావిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రొటీన్ రాజకీయం సాగుతోంది అన్నది ఉంది. వైసీపీ హయాంలో జరిగిన తప్పులే ఇపుడూ జరుగుతున్నాయి అన్నది ఉంది. ఇదే విధంగా సాగితే ఇబ్బందుల్లో పడతామన్నది కూడా ఉంది.

ఈ క్రమంలో పవన్ జనసేన ఆవిర్భావ సభలో ఏమి మాట్లాడుతారు అన్నది చర్చగా ఉంది. ఆయన మనసు విప్పి మాట్లాడుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిజానికి పొలిటీషియన్ గా కంటే సాధారణ వ్యక్తిగానే ప్రతీ విషయం మీద రియాక్ట్ అవుతారు. ఆయనలో ఎక్కడో మధ్యతరగతి మనిషి స్వభావం ఉందని అంటారు. అంతే కాదు సగటు జీవి ఆలోచనలు ఆయనకు ఉన్నాయి.

అందువల్ల చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఇపుడు జనసేన పార్టీ పండుగలో తన మనసులోని మాటలను ఏమైనా పంచుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా జనసేన సభలో పవన్ స్పీచ్ ఏమి ఇస్తారు ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి అవి ఎంతలా సంచలన రేపుతాయి అన్నది మాత్రం ఇపుడు అంతటా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News