సోము రూటులో మాజీ ఎంపీ...లక్కు చిక్కినట్లేనా ?
ఈ వరసలో సీనియర్ నేత అయిన సోముకు పదవి దక్కింది. దాంతో ఇపుడు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా తొందరలోనే ఏదో ఒక కీలక పదవిని అందుకుంటారు అని అంటున్నారు.;
బీజేపీలో టీడీపీ యాంటీ బ్యాచ్ గా ముద్రపడిన నేతలకు టీడీపీ కూటమిలో ప్రాధాన్యత దక్కుతోంది. దానికి కళ్ళెదుట కనిపించే ఉదాహరణ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. సోము ఇపుడు ఈ హోదాతో మరింత జోరు చేస్తారు అని చెప్పవచ్చు. అంతే కాదు ఆయనకు మంత్రి పదవి రెడీగా ఉందని ప్రచారం సైతం సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం మీద కేంద్ర బీజేపీ పెద్దలు పట్టు సాధించారనడానికి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ బెర్త్ కంఫర్మ్ కావడమే ఉదాహరణ అని అంటున్నారు. సోము వీర్రాజు విషయంలో చంద్రబాబు అభ్యంతరం కూడా పెద్దగా పెట్టలేకపోయిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
కేంద్రంతో ఏపీ ప్రభుత్వానికి అవసరాలు ఉండడంతో పాటు నిధుల విషయంలో కేంద్రం మీద ఆధారపడటం వల్ల కూడా బాబు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో బీజేపీ ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న వారిని పార్టీ వాయిస్ ని బలంగా వినిపించే వారిని తీసుకుని వచ్చి పదవులు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు.
ఈ వరసలో సీనియర్ నేత అయిన సోముకు పదవి దక్కింది. దాంతో ఇపుడు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా తొందరలోనే ఏదో ఒక కీలక పదవిని అందుకుంటారు అని అంటున్నారు. ఆయన కూడా బీజేపీ పెద్దలకు చాలా కావాల్సిన వారుగా ఉన్నారు.
దాంతో బీజేపీ వీరి విషయంలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అయినా కీలక పదవులలో కూర్చోబెడుతుందని అంటున్నారు. అలా జీవీఎల్ కి కూడా రానున్న రోజులలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు ఏదైనా కంఫర్మ్ చేయిస్తారా అన్న చర్చ సాగుతోంది. జీవీఎల్ మంచి వక్తగా ఉన్నారు. పార్టీ గురించి గట్టిగా ఆయన జనలోనూ మీడియాలోనూ ఉంచగలితే నేత.
తెలుగు ఇంగ్లీష్ హిందీలలో ఆయనకు పట్టు ఉంది. ఆయనకు నిజానికి 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు దక్కాల్సి ఉంది. కానీ అప్పటి రాజకీయ సమీకరణల వల్లనే అది సాధ్యపడలేదు. జీవీఎల్ ని విశాఖ వెళ్ళి పనిచేసుమని చెప్పిది కూడా బీజేపీ కేంద్ర పెద్దలే అని అంటారు.
అటువంటిది జీవీఎల్ ఏ పదవి లేకుండా ఉంటే కేంద్ర పెద్దలు కూడా ఆగుతారా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఆయనను మంచి పొజిషన్ లో ఉంచే బాధ్యతను కేంద్ర పెద్దలు తీసుకుంటారు అన్న నమ్మక మయితే సోము వీర్రాజు పదవితో అందరిలో కలుగుతోందిట.
అంతే కాదు మరో కీలక నేత రాయలసీమకు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ అవకాశం ఫ్యూచర్ లో రావచ్చు అని అంటున్నారు. ఆయనను కూడా రాయలసీమలో కీలక నేతగా బీజేపీ చూస్తోంది. ఆయన కూడా విద్యార్థి రాజకీయాల నుంచి బీజేపీలో ఉన్నారు.
దాంతో ఆయన వర్గం కూడా తమ చాన్స్ ఎపుడో ఒకపుడు అని ఆలోచిస్తూ ఆశ పడుతోందిట. ఇక పీవీఎన్ మాధవ్ ని ఈ ఏడాది జూన్ నాటికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అని అంటున్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడం ద్వారా బీసీలకు చేరువ కావడమే కాకుండా ఆరెస్సెస్ నేపథ్యం నుంచి ఉన్న వారికి పదవులు కట్టబెట్టడం అన్న సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తుందని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే బీజేపీలో యాంటీ టీడీపీ బ్యాచ్ కి పదవులు దక్కవు. ఇక వారు సైడ్ లైన్ లోనే అని అనుకున్న వారంతా ఖంగు తినెలా సోము వీర్రాజుకు పదవి దక్కడంతో బీజేపీలో ఎవరికి అయినా చాన్స్ రావచ్చు అని అంటున్నారు. కేంద్ర పెద్దలు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన క్రమంలో పదవుల విషయంలో మొదటి నుంచి పార్టీ గొంతు వినిపించేవారికే అని అంటున్నారు.