పోలవరంపై కొత్త కలవరం... కేంద్రం షాకింగ్ ప్రకటన!!

అవును... ఏపీకి జీవనాడని తరతరాలుగా చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ విషయం చెప్పింది.

Update: 2024-02-09 09:37 GMT

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం! జనరేషన్ మారిపోతున్నా, దశాబ్ధాలు గడిచిపోతున్నా... ఈ స్టేట్ మెంట్ ఎన్నికల సమయంలో విపరీతంగా వైరల్ గా వినిపిస్తుంది తప్ప ఆ ప్రాజ్కెట్ నిర్మాణం మాత్రం పూర్తవ్వడం లేదు! 2014 సమయంలో దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. చంద్రబాబు దాని నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు!! జాతికి బాబు చేసిన అతిపెద్ద ద్రోహంగా ఇది చరిత్రపుటల్లో నిలిచిపోతుందని అంటున్నారు! ఈ క్రమంలో తాజాగా పోలవరంపై కేంద్రం షాకింగ్ విషయం చెప్పింది.

అవును... ఏపీకి జీవనాడని తరతరాలుగా చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం షాకింగ్ విషయం చెప్పింది. పదేళ్ల క్రితం జాతీయ హోదా ఇచ్చి తామే నిర్మాణం చేసి ఇస్తామని ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటివరకూ కొలిక్కిరాలేని విషయాన్ని పక్కపెడుతూ... తొలిదశపనులు పూర్తవ్వడానికే మరో రెండేళ్లుపైగా పడుతుందని చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో... 2014 తర్వాతి సంగతులను తలచుకుని ఫైరవుతున్నారు ఆంధ్రులు!

పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం పూర్తవ్వడానికి 2026 మార్చి నెలను తాజా గడువుగా నిర్ణయిస్తూ కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది. అంటే 2026 నాటికే కేవలం తొలి దశ పనులు మాత్రమే పూర్తి కావాలని లక్ష్యం అన్నమాట! ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ పార్లమెంట్లో ప్రకటన చేశారు. తాజాగా నంద్యాల వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా బదులిచ్చారు.

ఇదే సమయంలో... 437 వేల హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించారని చెప్పిన మంత్రి... ఆ సామర్థ్యాన్ని ఇంకా సృష్టించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఏపీలోని 8 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన - ఏఐబీపీ కింద పాక్షికంగా నిధులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. వాటిలో మద్దిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. మిగిలినా 7 ప్రాజెక్టులూ వివిద దశల్లో ఉన్నట్లు తెలిపారు

Tags:    

Similar News