"వనరులు అవే.. అధికారులూ వాళ్లే.. కానీ.." చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

తాజాగా సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-02-11 08:38 GMT

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి రేపటికి 8 నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో ఇటీవల కేబినెట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. తాజాగా మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో బాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదని.. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.

ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం వచ్చి రేపటికి 8 నెలలు పూర్తివ్వబోతోందని.. ఈ నేపథ్యంలో గడిచిన ఆరు నెలల పాలనలో 12.94 శాతం వృద్ధి రేటు కనిపించిందని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లు విధ్వంసం జరిగిందని.. అందువల్ల వెనుకబడిపోయామని.. ఇప్పుడు ఒక్కో సమస్యనూ అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.

ఇదే సమయంలో... ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచి, త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని.. సమస్యలను త్వరగా పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని.. తాను ఈ వ్యాఖ్యలు కొంతమందిని ఎత్తు చూపించడానికి అనడం లేదని.. వ్యవస్థ మెరుగుపడాలని చంద్రబాబు.. మంత్రులకు, అధికారులకు సూచించారు.

వాస్తవానికి గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని చెప్పిన చంద్రబాబు.. ఈ సారి మాత్రం ఎన్నో సవాళ్లు ఎదుక్రోవాల్సి వస్తోందని.. ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోవడం తొలిసారని అన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారని.. వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని తెలిపారు.

ఇందులో భాగంగా... స్వర్ణాంద్ర - 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని.. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వనరులవే ఉన్నాయి, అధికారులూ వాళ్లే ఉన్నారు.. కానీ, వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కవాలి అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News