35 ఏళ్లుగా ఆదరిస్తున్న కుప్పంపై చంద్రబాబు 'స్వర్ణ' విజన్ ఇదే!

తాజాగా ద్రవిడ యూనివర్సిటీలో నిర్వహించిన సభలో "స్వర్ణ కుప్పం - విజన్ 2029" డాక్యుమెంట్ ఆవిష్కరించారు చంద్రబాబు.

Update: 2025-01-06 19:30 GMT

చంద్రబాబు ఇటీవల విజన్-2047 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రాబోయే పాతికేళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయంపై ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్న నియోజకవర్గానికి సంబంధించిన విజన్ ను బాబు ఆవిష్కరించారు.

అవును... వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయంపై ఇప్పటికే విజన్-2047 విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన విజన్ ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా.. సుమారు 35 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న కుప్పాన్ని ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు!

తాజాగా ద్రవిడ యూనివర్సిటీలో నిర్వహించిన సభలో "స్వర్ణ కుప్పం - విజన్ 2029" డాక్యుమెంట్ ఆవిష్కరించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని చెప్పడం గమనార్హం!

ఈ సందర్భంగా... రాబోయే రోజులో కుప్పం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తామనే ప్రణాళికలు రచించామని.. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే.. వారంతా శాశ్వంతా ఎమ్మెల్యేలుగా ఉంటారని చంద్రబాబు తెలిపారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకూ కుప్పంలో ఆ పార్టీ తప్ప మరో పార్టీ జెండా ఎగరలేదని.. పోటీ చేసిన అన్ని సార్లూ ప్రజలు తనను గెలిపించారని చెప్పిన చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాను తెచ్చిన విజన్ డాక్యుమెంట్ పై నియోజకవర్గంలోని ప్రతీ ఇంటిలోనూ చర్చ జరగాలని చెప్పుకొచ్చారు.

ఈ సందర్హంగా ఎవరి ఇళ్లపై వారే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలని పిలుపునిచ్చిన చంద్రబాబు... సౌర, పవన విద్యుత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, వీటి వల్ల కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని అన్నారు. తాజాగా కుప్పంలోని నడిమూరు విలేజ్ లో "సూర్య ఘర్" సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు చంద్రబాబు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ "సూర్య ఘర్" ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటిలోనూ నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. అందులో 60 యూనిట్లు వాడుకోవచ్చని, మిగిలిన 120 యూనిట్లను గ్రిడ్ కు అనుసంధానం చేయవచ్చని అన్నారు. ప్రజలకు ఫ్యూచర్ లో కరెంట్ బిల్లు కట్టే భారం ఉండదన్నారు.

Tags:    

Similar News