జగన్ అలా చేయాల్సిందే...లేకపోతే ?

చంద్రబాబు అండ్ బృందం దావోస్ టూర్ కి వెళ్ళారని ఆర్భాటం తప్ప ఏమీ ఒరగడం లేదని వైసీపీ అంటోంది.

Update: 2025-01-21 09:30 GMT

ఏపీ ప్రజలకు ఏమి కావాలో అది చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. ఆ విషయం లో జగన్ చాలా వెనుకబడి ఉన్నారు అన్నది ఏడు నెలల కూటమి పాలన తేల్చేసింది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలి. ఆ మీదట దానికి అనుగుణంగా యాక్షన్ కి ప్రిపేర్ కావాలి. ఈ లోగా ఎప్పటికప్పుడు అప్డేట్ జనాలకు ఇవ్వాలి.

చంద్రబాబుది ప్రచార ఆర్భాటం అని ఈ రోజుకీ వైసీపీ విమర్శలు చేస్తుంది. కానీ చంద్రబాబు ప్రజలకు తాను ఎక్కడ ఉన్నాను ఏమి చేస్తున్నాను అన్నది చాలా స్పష్టంగా చెబుతున్నారు. జనాలు కూడా అది తెలుసుకోగోరుతున్నారు. ఈ విషయం వైసీపీ నేతలకు అర్ధం కాకపోతే ఎలా అన్నదే చర్చగా ఉంది.

చంద్రబాబు అండ్ బృందం దావోస్ టూర్ కి వెళ్ళారని ఆర్భాటం తప్ప ఏమీ ఒరగడం లేదని వైసీపీ అంటోంది. అయితే చంద్రబాబు టీం దావోస్ లో అడుగుపెట్టినది లగాయితూ డే వన్ నుంచి అక్కడ వారు ఏమేమి చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇత్యాది విషయాలు అన్నీ కూడా వీడియోల ద్వారా ఫోటోల ద్వారా ఇతర సమాచారం ద్వారా జనాలకు చేరవేస్తున్నారు.

దీని వల్ల టీడీపీ కూటమి ప్రభుత్వం తమ కోసం ఏమి చేస్తుంది అన్నది జనాలకు అర్ధం అవుతుంది. అంతే కాదు ఏపీ కోసం వారు ఏమి చేయబోతున్నారు అన్నది కూడా అర్ధం అవుతోంది. నిజానికి ఫలితం ఉంటేనే ప్రకటన అన్నది పాత నీతి. ప్రయత్నం కూడా జనాలకు తెలియాలి. తాము ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే ఆ సంగతి వేరు కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేశామన్నది కూడా జనాలకు తెలియచేయడం నాయకులకు చాలా అవసరం.

ఉదాహరణకు చూస్తే చంద్రబాబు ఢిల్లీ టూర్ కి వెళ్తారు. అక్కడ ఆయన పాత్రికేయులతో భేటీ అవుతారు. తరువాత ప్రధాని హోం మంత్రి వంటి పెద్దలను కలుసుకుంటారు. ఆ తరువాత కూడా తాము వారికి ఏమేమి తెలియచేసింది, ఏ విన్నపాలు కోరింది మళ్ళీ మీడియాకు చెబుతారు.

దీని వల్ల జనాలకు ప్రభుత్వం పని చేస్తోంది అన్న సందేశం కచ్చితంగా వెళ్తుంది. అద జగన్ జమానాలో ఆయన కూడా అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు, కేంద్ర పెద్దలను కలిశారు, అయితే ఆయన ఏమేమి మాట్లాడిది మీడియాకు అయితే చెప్పలేదు, సీఎంవో ఆఫీసు ప్రకటన మాత్రమే జారీ చేసేది. దీని వల్ల సగటు జనాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటి అన్నది తెలియరాలేదు.

ఇక సామాజిక పెన్షన్ సహా ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పధకాలే కావచ్చు. చంద్రబాబు పేదల ఇంటికి వెళ్ళి అక్కడ టీ కాచి మరీ వారి ముచ్చట్లు విని వస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది అన్నది ప్రజలకు తెలుస్తోంది. అలాగే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా పాలకులకు తెలుస్తాయి. కేవలం ఇది ఏపీలోనే కాదు తమిళనాడులోనూ అక్కడ సీఎం స్టాలిన్ అయితే ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణించారు. ప్రజల కష్టాలను ఆయన అలా తెలుసుకున్నారు.

దానిని ఎవరూ ప్రచార ఆర్భాటం అని అనలేరు కదా. అందువల్ల వైసీపీ అధినాయకత్వం ఇలాంటి విషయాలను లాజిక్ తో ఆలోచిస్తేనే తప్ప ముందుకు వెళ్లలేరని అంటున్నారు. ఈ రోజున ఎవరు ఏమి చేస్తున్నారు అన్నది ఒకటికి పదిసార్లు చెప్పుకోవాలి. మన గురించి ఎవరో మాట్లాడుతారు అనో లేక మన పధకాలే మాట్లాడుతాయనో భావిస్తే మాత్రం అది తప్పు అన్నది 2024 ఎన్నికల్లో రుజువు అయ్యాక కూడా వైసీపీ ఇంకా లో ప్రొఫైల్ పాలిటిక్స్ ని చేస్తామంటే ఏపీ లాంటి చోట్ల కుదరదని అంటున్నారు. అందునా చంద్రబాబు వంటి వారి ముందు అది అసలు పనిచేయదనే అంటున్నారు. సో మారాల్సింది వైసీపీ అధినాయకత్వం అని అంటున్నారు.

Tags:    

Similar News